ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) బెయిల్ రద్దు వ్యవహారం (YS Jagan Bail Issue) మరో మలుపు తిరిగింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishanm Raju) వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy), వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి (YSRCP MP Vijay Sai Reddy) బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ( MP Raghu Rama Krishnam Raju) వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలిచ్చింది. విచారణను వేరే కోర్టుకు బదిలీ చేయడానికి నిరాకరించింది. ఈ మేరకు రఘురామ వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ రఘురామ కోరగా కోర్టు తిరస్కరించింది. పిటిషన్ పై బలమైన వాదనలు లేకపోవడం, సీబీఐ కూడా పిటిషనర్ వాదనను తోసిపుచడంతో.. రఘురామ కృష్ణరాజు పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. సహేతుకమైన కారణం లేకుండా బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది. మరోవైపు సాక్షి మీడియాపై వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను మాత్రం హైకోర్టు బదిలీ చేసింది.
ఇదిలా ఉంటే సీఎం జగన్ బెయిలు రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. కోర్టు తీర్పుపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరి బెయిల్ రద్దు అవుతుందా.. కొనసాగుతుందా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జగన్ బెయిల్ రద్దవుతుందని ప్రతిపక్షాలు ఒకింత గట్టినమ్మకంతో ఉన్నాయి. పిటిషనర్ ఎంపీ రఘురామ రాజు అయితే చాలా నమ్మకంతో జగన్ బెయిన్ రద్దు అవుతుందని పదే పదే చెబుతున్నారు.
బీజేపీ నేతలు, బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ రఘురామ మాత్రం బెయిల్ రద్దవుతుందని చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం బెయిల్ రద్దు అయ్యే అవకాశం లేదని వాదిస్తున్నారు. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు కబట్టే ఇటీవల ఎంపీ విజయసాయి రెడ్డికి విదేశాలకు అనుమతి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.
అయితే వైసీపీ వర్గాల్లో ఇప్పుడు మరో ప్రాచారం కూడా ఉంది. బీజేపీ అధిష్టానం.. ముఖ్యంగా అమిత్ షా నుంచి సీఎం జగన్ కు స్పష్టమైన సంకేతాలు ఉన్నట్టు తెలుస్తోంది. బెయిల్ రద్దు అయ్యే అవకాశం లేదని జగన్ కు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎం జగన్ సైతం చాలా ధీమాగా ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఈ నెల 16న అంటే గురువారం ఏపీ కేబినెట్ భేటీని సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని. నిజంగా బెయిల్ రద్దవుతుందా..? లేదా అనే అనుమానం ఉంటే.. తీర్పు తరువాతే కేబినెట్ భేటీపై నిర్ణయం తీసుకుంటారు కదా అని లాజిక్ చెబుతున్నారు. మరి చూడాలి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.