Home /News /politics /

TELANGANA HC POSTPONES HEARING OF PETITION ON TSRTC EMPLOYEES SALARIES SB

ఆర్టీసీ ఉద్యోగుల జీతాలపై... ఇవాళ హైకోర్టులో విచారణ

Video : మంత్రి ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు.. బర్తరఫ్ కు డిమాండ్

Video : మంత్రి ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు.. బర్తరఫ్ కు డిమాండ్

ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల పట్టుదల మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

    తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె 12వ రోజుకు చేరింది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. 49,190 మంది ఆర్టీసీ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వమే కక్ష పూరితంగా ప్రవర్తిస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో ఈ కేసు విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

    బుధవారం ఆర్టీసీ సమ్మెపై విచారించిన న్యాయస్థానం ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల పట్టుదల మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించింది. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనను విన్న హైకోర్టు... సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని సూచించింది. దీంతో, సమ్మెలో ఉన్న కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని యూనియన్ నాయకులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన కూడా వెలువడిందని వారన్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: CM KCR, High Court, Telangana, Telangana High Court, Telangana Politics, Tsrtc, TSRTC Strike

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు