Telangana Graduate MLC elections results 2021: ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌కు షాకిచ్చారు. పల్లా రాజేశ్వర్ తర్వాత ఆయన రెండో స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్ అధినేత కోదండరాంను దాటుకొని మల్లన్న రెండో స్థానంలో కొనసాగడం హాట్ టాపిక్‌గా మారింది.
Telangana Graduate MLC elections results 2021: ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌కు షాకిచ్చారు. పల్లా రాజేశ్వర్ తర్వాత ఆయన రెండో స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్ అధినేత కోదండరాంను దాటుకొని మల్లన్న రెండో స్థానంలో కొనసాగడం హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నిన్న ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమయింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. రెండు రౌండ్ల కౌంటింగ్ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడింగ్‌లో ఉన్నారు. మొదటి రౌండ్‌తో పాటు రెండో రౌండ్లోనూ ఆయన హవా కొనసాగింది. ఐతే ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌కు షాకిచ్చారు. పల్లా రాజేశ్వర్ తర్వాత ఆయన రెండో స్థానంలో కొనసాగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్ అధినేత కోదండరాంను దాటుకొని మల్లన్న రెండో స్థానంలో కొనసాగడం.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నల్గొండ సెగ్మెంట్ పరిధిలో తొలి రెండ్లు కలిపి 1,12,006 ఓట్లు లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 31,987 ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన నిలిచారు. ఆయనకు 24,116 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం 18,528 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 13,284 ఓట్లతో నాలుగు స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ 7,598 ఓట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 3,787 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రెండో రౌండ్ (56,003)
పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) 15,857
తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్) 12,070
కోదండరామ్ (టీజేఎస్) 9,448
ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ) 6,669
రాములు నాయక్ (రాములు నాయక్) 3,244
నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజక పరిధిలో 71 మంది బరిలో ఉన్నారు. 3,86,320 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు భారీగా ఓట్లు పోలవడంతో పాటు అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఫలితాలు మరింతగా ఆలస్యం అయ్యే అవకాశముంది. అటు సిబ్బంది అవగాహన లేమితోనూ కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.