• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA GRADUATE MLC ELECTIONS 2021 RESULTS TRS CANDIDATES PALLA RAJESHWAR REDDY AND SURABHI VANIDEVI LEADING IN HYDERABAD AND NALGONDA SK

Telangana MLC results: ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ.. టీఆర్ఎస్ లీడింగ్.. 2వ ప్రాధాన్యత ఓట్లే కీలకం

Telangana MLC results: ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ.. టీఆర్ఎస్ లీడింగ్.. 2వ ప్రాధాన్యత ఓట్లే కీలకం

సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి

Telangana Graduate MLC Elections 2021 Results: రెండు చోట్లా హోరాహోరీ పోరు నెలకొనడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. నల్గొండ సెగ్మెంట్‌లో ఇఫ్పటికే మొదటి ప్రాధ్యానత ఓట్లకు సంబంధించి 7 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.

  • Share this:
    తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.  బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ.. సుదీర్ఘంగా సాగుతోంది.  ఐతే రెండు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే లీడింగ్‌లో ఉన్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టుభద్రుల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి లీడింగ్‌లో కొనసాగుతున్నారు. రెండు చోట్లా హోరాహోరీ పోరు నెలకొనడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. నల్గొండ సెగ్మెంట్‌లో ఇఫ్పటికే మొదటి ప్రాధ్యానత ఓట్లకు సంబంధించి 7 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.

    నల్గొండ పరిధిలో ఏడు రౌండ్లు పూర్తయ్యాక... టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 3,87,969 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636 ఓట్లు చెల్లకపోవడంతో.. 3,66,333 ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు. వీటిలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,10,840 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న తీన్మార్‌ మల్లన్నకు 83,290 ఓట్లు పోలయ్యాయి. ఇక ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 70,072, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,588 ఓట్లు పడ్డాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50శాతం పైగా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారాయి.


    అటు హైదరాబాద్ సెగ్మెంట్ హోరాహోరీగా నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి.. తన సమీప ప్రత్యర్థి రాంచంద్రరావుపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ లీడింగ్ కనబరిచింది. కానీ ఆధిక్యత స్వల్పంగానే ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. 5 రౌండ్లు పూర్తయ్యే సరికి సురభి వాణిదేవికి 88,304 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు ఉన్నారు. ఆయనకు 81,749 ఓట్లు పడ్డాయి. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వరరావు 42,604కు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,400 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం వాణిదేవి 6,555 లీడింగ్‌లో ఉన్నారు. ఇక్కడ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం కానున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తున్నారు. ఐతే వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి పడిందో.. దానిని ఆ అభ్యర్థులకు కలుపుతారు. అవసరం అయితే మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కపెడతారు.


    కాగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌ పట్టభద్రుల నియోజవర్గంలో 93 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 3,57,354 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజక పరిధిలో 71 మంది బరిలో ఉన్నారు. 3,86,320 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు