తగ్గిన కేసీఆర్.. యాదాద్రిలో ‘రాజకీయ చిత్రాలు‘ తొలగింపు

Yadadri Temple | యాదాద్రిలో అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్‌తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉంచకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

news18-telugu
Updated: September 7, 2019, 11:10 PM IST
తగ్గిన కేసీఆర్.. యాదాద్రిలో ‘రాజకీయ చిత్రాలు‘ తొలగింపు
యాదాద్రి ఆలయ అష్టభుజి ప్రాకారంపై కేసీఆర్ ముఖచిత్రం (File)
  • Share this:
యాదాద్రిలో శిల్పాలపై కేసీఆర్ చిత్రాల వివాదం ముగిసింది. యాదాద్రిలో అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్‌తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉంచకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి ఆలయంలో దైవ సంబంధిత చిహ్నాలే తప్ప మరే ఇతర చిత్రాలు ఉండడానికి వీల్లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా భారీ ఎత్తున శిల్పాలనుచెక్కుతున్నారు. అయితే, ఆలయం బయట ఏర్పాటు చేసిన అష్టభుజి బాహ్య ప్రాకారంలో కేసీఆర్, కేసీఆర్ కిట్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు లాంటివి స్తంభాలపై కనిపించాయి. దీంతో అది రాజకీయ దుమారానికి తెరలేపింది. అయితే, అది శిల్పుల ఇష్టమని యాదాద్రి ఆలయ అభివృద్ధి అధారిటీ స్పష్టం చేసింది. ప్రస్తుత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేవి ఈ శిల్పాలని, వాటిలో రాజకీయాలు తగదని సూచించింది. ఒకవేళ తీవ్ర అభ్యంతరాలు వస్తే వాటిని తీసేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పింది.

బాహ్య ప్రాకారంలోని స్తంభాల్లో కేసీఆర్‌తో పాటు గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, కమలం పువ్వు, సైకిల్ వంటి కొన్ని రాజకీయ చిహ్నాలు కూడా ఉన్నాయి. ఆలయాల్లో వాటిని చెక్కడంపై సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, మరికొందరితో ఆయన ప్రగతిభవన్‌లో సమావేశమై చర్చించారు. ఆలయ ప్రాంగణంలో తన చిత్రం ఉండాలని సీఎం కేసీఆర్ కోరుకోరని, కేవలం దేవాలయ విశిష్టత, దైవ సంబంధిత అంశాలకు మాత్రమే శిల్పులు పరిమితం కావాలనేది సీఎం ఆకాంక్ష అని భూపాల్ రెడ్డి వారికి చెప్పారు. తక్షణం నాయకుల చిత్రాలు, పార్టీల చిహ్నాలు తొలగించాలని చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 7, 2019, 8:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading