కేసీఆర్ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్.. ఆ నేతల్లో సంబరం...

తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కార్పొరేషన్ పదవులను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పరిధి నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.

news18-telugu
Updated: December 4, 2019, 5:00 PM IST
కేసీఆర్ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్.. ఆ నేతల్లో సంబరం...
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కార్పొరేషన్ పదవులను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పరిధి నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. క్యాబినెట్ నిర్ణయం మేరకు ఆర్డినెన్స్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. జీతాలు, పెన్షన్ చెల్లింపులు, అనర్హత తొలగింపు చట్ట సవరణ కూడా చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. గతంలో ఒక ప్రజాప్రతినిధి మరో లాభదాయకమైన పదవి చేపడితే వారిని అనర్హులుగా ప్రకటించేందుకు వీలుంది. కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. ఇకపై ఒక ప్రజాప్రతినిధి రెండు పదవులను నిర్వహించవచ్చు. రెండు చోట్లా జీతం, భత్యం, ఇతర ఆర్థికపరమైన లాభాలను కూడా పొందడానికి అవకాశం లభించనుంది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్


టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివిధ కార్పొరేషన్ పదవులను అప్పగించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమించారు. ఓ ఎమ్మెల్సీ మరో చోట కూడా వేతనం, ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందితే చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు పడుతుంది. దీంతో ఈ నిబంధనను మారుస్తూ కేసీఆర్ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ జారీచేసింది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో దీనికి చట్టం రూపం కల్పించనుంది.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>