తెలంగాణ ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్...

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1.20లక్షల మంది ఔట్‌సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు.సకాలంలో జీతాలు అందక వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

news18-telugu
Updated: October 16, 2019, 12:06 PM IST
తెలంగాణ ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్...
ముఖానికి మాస్కు ఉంటే.. 75 శాతం మీరు సేఫ్‌గా ఉంటారని హరీశ్ రావు అన్నారు. గోరు వెచ్చని నీరు తాగడం, ముఖానికి ఆవిరి పట్టడం, జండు బామ్, అమృతంజన్, పసుపు, అల్లం, ఎల్లిపాయ, మిరియాలతో ఆవిరి పడితే.. నోరు నుంచి గొంతులోకి పోయేట్టు చేస్తే చాలా వరకు పరిష్కారం అవుతుందని చిట్కాగా చెప్పారు.
  • Share this:
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆయా శాఖల్లో ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఇకపై జీతం డబ్బుల కోసం రోజుల తరబడి వేచి చూసే ధోరణికి స్వస్తి పలకనుంది. ప్రతీ నెలా 7వ తేదీన ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగుల ఖాతాల్లో వేతనం డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య,ఆరోగ్య శాఖల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలంటూ ఆర్థికమంత్రి హరీశ్ రావును, మంత్రి ఈటల కోరారు. మంగళవారం వైద్య,ఆరోగ్య శాఖల అధికారులతో వీరిద్దరు భేటీ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు అందిస్తున్నట్టు.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 7వ తేదీన జీతాలు అందించాలని భేటీలో నిర్ణయించినట్టు సమాచారం.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1.20లక్షల మంది ఔట్‌సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు.సకాలంలో జీతాలు అందక వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపై ప్రతీ నెలా 7వ తేదీన జీతాలు అందిస్తే.. రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని శాఖల్లోని ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందడం లేదు.ఇలాంటి తరుణంలో ప్రభుత్వం 7వ తేదీన జీతాలు ఇవ్వాలని నిర్ణయించడం కచ్చితంగా వారికి సంతోషానిచ్చే విషయమే.
Published by: Srinivas Mittapalli
First published: October 16, 2019, 12:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading