బ్రేకింగ్... ఢిల్లీకి గవర్నర్ తమిళిసై... ఆర్టీసీ సమ్మెపై మోదీ, షాకు నివేదిక ?

రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసైకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: October 15, 2019, 11:26 AM IST
బ్రేకింగ్... ఢిల్లీకి గవర్నర్ తమిళిసై... ఆర్టీసీ సమ్మెపై మోదీ, షాకు నివేదిక ?
గవర్నర్ తమిళిసై, ఆర్టీసీ ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ గవర్నర్ తమిళిసైకు ఢిల్లీ నుంచి పిలుపు అందింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో గవర్నర్‌కు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న గవర్నర్ తమిళిసై... మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ప్రధానితో భేటీ అనంతరం సాయంత్రం 4 గంటలకు గవర్నర్ తమిళిసై హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ అంశంపై గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.




Published by: Kishore Akkaladevi
First published: October 15, 2019, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading