ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై చర్చలు

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక తమిళిసై ఢిల్లీలో పర్యటించడం ఇదే తొలిసారి.

news18-telugu
Updated: October 15, 2019, 10:28 PM IST
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై చర్చలు
మోదీ, అమిత్ షాతో తమిళిసై సమావేశం
news18-telugu
Updated: October 15, 2019, 10:28 PM IST
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పీఎం నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు ఆయనతో  భేటీ అయ్యారు.  రాజ్‌భవన్‌లో చేపట్టిన వినూత్న అంశాలపై ప్రధానికి నివేదిక అందించారు. ప్టాస్టిక్‌ నిషేధం, యోగా తరగతులు, రక్తదానశిబిరం వంటి కార్యక్రమాలపై నివేదిక అందించగా, గవర్నర్‌ తమిళిసైను ప్రధాని మోదీ అభినందించారు.

అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోనూ తమిళిసై భేటీ అయ్యారు. గవర్నర్‌గా ఆమె పాల్గొన్న సామాజిక కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలపై ప్రతులను ఆయనకు అందించారు. కాగా, తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక తమిళిసై ఢిల్లీలో పర్యటించడం ఇదే తొలిసారి.

 

First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...