రాజకీయాలకు రాజ్ భవన్ అడ్డా కాదు.. గవర్నర్ తమిళిసై కౌంటర్

కొద్దిరోజులుగా వ్యవసాయ చట్టంపై నిరసనలు తెలియజేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసైను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు.

news18-telugu
Updated: October 2, 2020, 6:55 PM IST
రాజకీయాలకు రాజ్ భవన్ అడ్డా కాదు.. గవర్నర్ తమిళిసై కౌంటర్
తమిళిసై సౌందరరాజన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తనపై తెలంగాణ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా వ్యవసాయ చట్టంపై నిరసనలు తెలియజేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఇందులో భాగంగా గవర్నర్ తమిళిసైను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ అపాయింట్ మెంట్ ను కోరగా.. ఆమె అపాయింట్ మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. గవర్నర్ తీరు సరికాదని అన్నారు. అయితే కాంగ్రెస్ కామెంట్స్‌పై స్పందించిన తమిళిసై.. రాజకీయాలు చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కరోనా కారణంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆమె గుర్తు చేశారు. గత నాలుగు నెలలుగా ఇదే విధానాన్ని రాజ్ భవన్ అవలంభిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా రాజ్ భవన్ వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. రాజ్ భవన్ తలుపులు అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. కరోనా రికవరీ రేటులో తెలంగాణ ముందు స్థానంలో ఉందన్న తమిళిసై.. మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు.

తాను తమిళనాడు బిడ్డనని, తెలంగాణ చెల్లెల్ని అని చెప్పారు. త్వరలోనే తెలుగు నేర్చుకుంటానని తెలిపారు. ఎవరికైనా ఏ సమస్యలైనా ఉంటే మెయిల్ చేయాలని అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్.. శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ భర్త , ప్రముఖ నెఫ్రాలజిస్ట్ సౌందర్‌రాజన్‌కు ధన్వంతరి అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందచేశారు.
Published by: Kishore Akkaladevi
First published: October 2, 2020, 6:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading