తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌కు అస్వస్థత... ఆస్పత్రిలో చేరిక

వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

news18-telugu
Updated: August 19, 2019, 4:04 PM IST
తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌కు అస్వస్థత... ఆస్పత్రిలో చేరిక
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్
  • Share this:
తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమం నిమిత్తం బీహార్ వెళ్లిన ఆయన అనారోగ్యం పాలయ్యారు.  గయాలో సతీమణితో కలిసి తమ పూర్వీకులకు పిండ ప్రధానం చేసేందుకు వెళ్లిన నరసింహన్ ఆరోగ్యం పాడైంది.  సోమవారం అకస్మాత్తుగా నరసింహన్ వాంతులతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను సమీపంలోని మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. రక్తపరీక్షలు నిర్వహించి, ఈసీజీ తీశారు. ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తర్వాత డాక్టర్లు గవర్నర్‌‌ను అక్కడ్నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ అక్కడ పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. 

 

 

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు