లడఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్‌గా నరసింహన్...?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన కృష్ణకాంత్ కంటే ఎక్కవ కాలం పని చేసిన గవర్నర్‌గా నరసింహన్ చరిత్ర సృష్టించారు.

news18-telugu
Updated: August 6, 2019, 9:20 AM IST
లడఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్‌గా నరసింహన్...?
త్వరలో తెలంగాణ గవర్నర్ బదిలీ
  • Share this:
జమ్ముకాశ్మీర్ రెండు ముక్కలు కావడంతో... కేంద్రపాలితప్రాంతంగా ఏర్పాటైన లడఖ్‌కు నరసింహన్ గవర్నర్‌గా వెళ్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ల మార్పు ఖాయమంటూ వార్తలు వచ్చాయి. ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ కేంద్రం నియమించింది. ఇక మిగిలింది తెలంగాణయే. దీంతో ఇప్పుడు తెలంగాణ గవర్నర్ నరసింహన్‌కు కూడా స్థాన చలనం తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. నరసింహన్‌కు పదేళ్లుగా గవర్నర్‌గా పనిచేసే అనుభవం ఉంది. పోలీస్ అధికారిగా, గవర్నర్ బాధ్యతల నిర్వహణలో మంచి పేరున్న నరసింహన్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఒక రాష్ట్రానికి లెఫ్టెనెంట్ గవర్నర్‌గా నియమిస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

మరోవైపు డిసెంబర్ నాటికి గవర్నర్‌గా నరసింహన్‌కు పది సంవత్సరాలు నిండనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన కృష్ణకాంత్ కంటే ఎక్కవ కాలం పని చేసిన గవర్నర్‌గా నరసింహన్ చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిసెంబర్ 27, 2009లో నరసింహన్ గవర్నర్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా గత నెల జూలై 16వ తేదీ వరకు వ్యవహరించారు. గతంలో కేంద్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లడఖ్ గవర్నర్‌గా నరసింహన్‌ను నియమించే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం.First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు