• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA GOVERNOR NARASIMHAN INTERESTING COMMENTS ON HIS TENURE AK

తెలంగాణ గవర్నర్ మార్పు... నరసింహన్‌కు సంకేతాలు ?

తెలంగాణ గవర్నర్ మార్పు... నరసింహన్‌కు సంకేతాలు ?

గవర్నర్ నరసింహన్(ఫైల్ ఫోటో)

తెలంగాణ నుంచి త్వరలోనే ఆయన మరో ప్రాంతానికి బదిలీ కాబోతున్నారా ? అనే చర్చ మరోసారి మొదలైంది.

  • Share this:
    పదేళ్ల పాటు తెలుగు ప్రజలకు గవర్నర్‌గా వ్యవహరించిన ప్రస్తుత తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను కేంద్రం మరో రాష్ట్రానికి బదిలీ చేస్తుందనే ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే నరసింహన్ మాత్రం ఈ అంశంపై ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. అయితే కేంద్రం ఏపీకి హరిచందన్ బిశ్వభూషణ్‌ను ప్రత్యేక గవర్నర్‌గా నియమించిన నేపథ్యంలో... నరసింహన్ తెలంగాణకు పరిమితయ్యారు. అయితే తెలంగాణ నుంచి త్వరలోనే ఆయన మరో ప్రాంతానికి బదిలీ కాబోతున్నారా ? అనే చర్చ మరోసారి మొదలైంది. రాజ్‌భవన్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సన్మాన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి.

    తాను గవర్నర్‌గా ఉన్నా లేకున్నా 2020 ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించి రాజ్ భవన్‌ రావాలని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ ఏదో సరదాగా ఈ మాట అన్నారా ? లేక తన బదిలీపై ఆయనకు స్పష్టమైన సమాచారం ఉందా ? అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్‌ను విభజించి లడఖ్‌ను ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన కేంద్రం... దానికి నరసింహన్‌ను లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమించే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన సందర్భంలో ఆయనకు తన బదిలీకి సంబంధించి స్పష్టత వచ్చి ఉండొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు