తెలంగాణలో గవర్నర్ యాక్షన్ షురూ.. అప్రమత్తమవుతోన్న మంత్రులు..

బుధవారం పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన హోంమంత్రి మహమూద్ అలీ.. గవర్నర్ సమీక్షా సమావేశానికి సంబంధించి పోలీసులకు సంకేతాలిచ్చారు.

news18-telugu
Updated: September 19, 2019, 9:25 AM IST
తెలంగాణలో గవర్నర్ యాక్షన్ షురూ.. అప్రమత్తమవుతోన్న మంత్రులు..
ప్రమాణస్వీకారం సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ (File Photo)
news18-telugu
Updated: September 19, 2019, 9:25 AM IST
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రభుత్వ శాఖలపై సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే ఒక్కో శాఖపై ఆమె సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో మంత్రులంతా అప్రమత్తమవుతున్నట్టు తెలుస్తోంది. తమ శాఖలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆయా మంత్రులు అధికారుల వద్ద నుంచి తెప్పించుకుంటున్నట్టు సమాచారం. గవర్నర్ ఎప్పుడు సమీక్షా సమావేశానికి పిలిచినా.. పూర్తి సమాచారంతో వెళ్లాలని మంత్రులు భావిస్తున్నారు.

సమీక్షా సమావేశాల్లో భాగంగా మొదట విద్య,వైద్య శాఖలపై సమీక్ష నిర్వహించాలని గవర్నర్ భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ,టైఫాయిడ్ వంటి వైరల్ జ్వరాలు తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో వైద్య శాఖపై గవర్నర్ ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. వైరల్ ఫీవర్ కారణంగా మృతి చెందినవారి వివరాలను అందించాలని గవర్నర్ ఇప్పటికే అధికారులను కోరినట్టు తెలుస్తోంది. అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల వివరాలను కూడా గవర్నర్ కోరినట్టు సమాచారం.

కాగా, బుధవారం పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన హోంమంత్రి మహమూద్ అలీ.. గవర్నర్ సమీక్షా సమావేశానికి సంబంధించి పోలీసులకు సంకేతాలిచ్చారు. త్వరలోనే పోలీస్ శాఖపై గవర్నర్ సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. సమీక్షా సమావేశాల అనంతరం.. ఆ నివేదికను గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు చెప్పారు.

First published: September 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...