Home /News /politics /

KCR: వరి కొనుగోళ్లపై మీ వైఖరి ఏంటి ?.. కేంద్రానికి సీఎం కేసీఆర్ ప్రశ్న.. 18న టీఆర్ఎస్ మహాధర్నా

KCR: వరి కొనుగోళ్లపై మీ వైఖరి ఏంటి ?.. కేంద్రానికి సీఎం కేసీఆర్ ప్రశ్న.. 18న టీఆర్ఎస్ మహాధర్నా

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: కేంద్రం అనుసరిస్తున్న ద్వంద వైఖరి విధానం వల్లే తాము పంట మార్పిడి సూచించామని సీఎం కేసీఆర్ తెలిపారు.



    తెలంగాణలో పండించిన వరి ధాన్యం కొంటారా లేదా అన్నది స్పష్టం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పంజాబ్‌లో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొంటున్న కేంద్రం.. తెలంగాణ (Telangana) విషయంలో మాత్రం ఎందుకు ద్వంద వైఖరి అవలంభిస్తుందని ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర ద్వంద వైఖరిని నిరసనగా ఈ నెల 18న ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారని కేసీఆర్ (CM KCR) చెప్పారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ధర్నాలో పాల్గొని.. అనంతరం గవర్నర్‌కు వినతి పత్రం అందిస్తామని తెలిపారు. దీనిపై రేపు మరోసారి తాను ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయనున్నట్టు వివరించారు.

    కేంద్రం అనుసరిస్తున్న ద్వంద వైఖరి విధానం వల్లే తాము పంట మార్పిడి సూచించామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసలు కేంద్రం రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటుందనే దానిపై టార్గెట్ ఇవ్వాలని గతంలోనే కొోరామని చెప్పారు. ఓ వైపు కేంద్రం వరి ధాన్యం కొనకుండా ఇబ్బందిపెడుతుంటే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) యాసంగిలోను వరి ధాన్యం పండించాలని రైతులకు పిలుపునివ్వడం ఏమిటని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని గతంలో తాను కేంద్రమంత్రిని కలిశానని.. త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తామని చెప్పిన కేంద్రమంత్రి నుంచి 50 రోజులు గడిచిపోయాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

    రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..

    Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి

    కేంద్రం వరి కొనకుండా ధాన్యం కొనుగోళ్ల కే్ంద్రాల దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కారణంగానే రైతులు బండి సంజయ్‌ను నిలదీస్తున్నారని.. భవిష్యత్తులోనూ ఆయనకు ఇదే రకమైన అనుభవాలు ఎదురవుతాయని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలే బండి సంజయ్‌పై దాడి చేస్తున్నారన్న బీజేపీ నేతల ఆరోపణలపై సీఎం కేసీఆర్ స్పందించారు. రైతుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉంటారని.. తమకు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని.. వారిలో రైతులు కూడా ఉన్నారని కేసీఆర్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక విధానాలను టీఆర్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుందందని చెప్పారు. ఈ నెల 18 తరువాత తాము చేపట్టబోయే నిరసన తరువాత కూడా కేంద్రం దిగిరాకపోతే.. ఇక బీజేపీని వెంటాడి వేటాడతామని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, CM KCR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు