Etal Rajender: మాసాయిపేట మండలంలోని అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణ నేపథ్యంలో మంత్రి పదవి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈటల రాజీనామా చేసి.. బీజేపీలో చేరి గెలిచిన సంగతి తెలిసిందే. ఆ భూముల కబ్జా నిజమేనని కలెక్టర్ వెల్లడించారు.
మాసాయిపేట మండలంలోని అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణ నేపథ్యంలో మంత్రి పదవి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈటల రాజీనామా చేసి.. బీజేపీలో చేరి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూముల వ్యవహారంలోనే జమున హేచరీస్‌కు తాజాగా మెదక్ జిల్లా కలెక్టర్ తరఫున డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఇటీవల నోటీసులు జారీ చేసి.. నవంబర్ 16వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
విచారణకు హాజరైన తర్వాత దీనికి సంబంధించి వివరాలను మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ వెల్లడించారు. జమునా హేచరీస్ అసైన్డ్ భూములను కబ్జా చేసినట్టుగా తేలిందన్నారు. 70.33 ఎకరాలు కబ్జా చేసినట్టుగా గుర్తించినట్టుగా చెప్పారు.
ఎల్క చెరువు, హల్దీవాగులోకి పౌల్ట్రీ వ్యర్థాలు విడుదల చేస్తున్నట్టుగా స్థానికుల ర్యాదు చేసినట్టుగా తెలిపారు. 70.33 ఎకరాల సీలింగ్, అసైన్ట్ భూములను కబ్జా చేసినట్లుగా సర్వేలో తేలిందని తెలిపాడు. దీనిలో కొన్ని రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని వెల్లడించాడు. సర్వే నెంబర్ 81లో 5 ఎకరాల వరకు, 130లో 3 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ జరిగింది. మొత్తం దీనిలో 56 మంది భూములను కబ్జా చేసినట్లుగా సర్వేలో తెలిసిందన్నారు. ఈ కబ్జా వ్యవహారం అంతా బలవంతగా.. పెద్దల పలుకుబడితో జరిగిందని.. ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
ఈ సేల్ డీడ్స్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని కలెక్టర్ హరీష్ తెలిపారు. వ్యవసాయేతర అవసరాలకు ఈ అసైన్ట్ భూములను వాడుతున్నట్లుగా కలెక్టర్ వెల్లడించాడు. అటవీ ప్రాంతంలో చెట్లను నరకడం.. రోడ్లు వేయడం వంటి పనులు చేశారని.. ఇది వాల్టా చట్టానికి విరుద్ధమన్నారు. అక్కడ నిర్మించిన షెడ్ లకు ఎంలాంటి అనుమతులు లేవని.. భూముల రిజిస్ట్రేషన్లు అనేవి నిషేధిత జాబితాలోని భూముల్లో చేసుకున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.
భూ కబ్జా, అసైన్ట్ భూములపై అక్రమనిర్మాణాలకు సంబంధించిన వాటిపై నివేదిక పంపించామన్నారు. అక్రమాలకు పాల్పడిని వాళ్లపై.. దీనికి సపోర్ట్ గా నిలబడిన వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తమ భూములు కబ్జా చేసినట్టుగా రైతులు చేసిన ఆరోపణలు నిజమని తేలిందని... బాధితులకు న్యాయం చేసేలా నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టుగా తెలియజేశారు.
ఇదంతా ఇలా ఉండగా.. హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచిన ఆనందంలో ఎన్నికల నిబంధనలు, కరోనా రూల్స్ ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారంటూ ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భూ కబ్జా నిజమని తేలడంతో ఈటల రాజేందర్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.