Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిపై కేసీఆర్ ఏం చేయబోతున్నారు ?

కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ ఎన్నికల కోసమే కౌశిక్ రెడ్డిని వాడుకుని వదలిస్తారనే ప్రచారం బీజేపీ, కాంగ్రెస్ నేతలు మొదలుపెట్టారు. ఇది ఎన్నికల్లో తమకు నష్టం కలిగిస్తుందని భావిస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం.. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

  • Share this:
    హుజూరాబాద్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి కొన్నాళ్ల క్రితం టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) గెలుపు కోసం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఏ పదవి ఇస్తారో అని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో అనూహ్య నిర్ణయం వచ్చింది. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేశారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి.. అనంతరం గవర్నర్‌కు సిఫార్సు చేశారు. సామాజిక సేవ విభాగంలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు తెలిపింది. అయితే కౌశిక్ రెడ్డికి(Kaushik Reddy) ఎమ్మెల్సీ పదవి వ్యవహారాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) పెండింగ్‌లో పెట్టారు. కొన్నాళ్లుగా ఆమె ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టడంతో... కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వస్తుందో రాదో అనే టెన్షన్ ఆయన అనుచరుల్లో నెలకొంది.

    ఇదిలా ఉంటే కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే కౌశిక్ రెడ్డిని వాడుకుని వదలిస్తారనే ప్రచారం బీజేపీ, కాంగ్రెస్ నేతలు మొదలుపెట్టారు. ఇది ఎన్నికల్లో తమకు నష్టం కలిగిస్తుందని భావిస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం.. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిపై గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా ఉండటాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

    మహారాష్ట్రలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం హుజూరాబాద్‌లో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి పదవి ఇచ్చే విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం చిత్తశుద్ధితో ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు.. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చర్చ జరుగుతోంది.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ నాయకత్వంపై కౌశిక్ రెడ్డి పూర్తి విశ్వాసంలో ఉన్నారని.. అందుకే ఈ విషయంలో ఆయనకు ఎలాంటి అసంతృప్తి లేదని గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: