Home /News /politics /

TELANGANA GARDUATE MLC ELECTIONS 2021 CANDIDATES FROM MAIN PARTIES FROM THIS DISTRICT KNR SK

Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రధాన అభ్యర్థులంతా ఈ జిల్లా వారే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసులు చాలా మంది హైద్రాబాద్ ప్రాంతంలో స్థిర పడ్డవారు ఉన్నారు. పట్ట భద్రులు , విద్యావంతులు అనేక మంది ఇక్కడి వారు ఉన్నారు. హైకోర్టులో సికింద్రాబాద్ కోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అక్కడ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటుహక్కు కలిగిన వారు వేల సంఖ్యలో ఉంటారు.

ఇంకా చదవండి ...
    (పి. శ్రీనివాస్, కరీంనగర్ కరెస్పాండెంట్)

    తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. అన్ని పార్టీల నేతలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఐతే హైదరాబాద్ - రంగారెడ్డి మహబూబ్ నగర్, ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కీలకంగా మారింది . హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాలకు చెందిన ఎల్.రమణ టీడీపీ తరుపున, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవి టీఆర్ఎస్ తరుపున తలపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి జేఎసీని స్థాపించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు చెందినవారు. రెండు చోట్ల పోటీ చేస్తున్న ముగ్గురు నేతలు ఉమ్మడి జిల్లాకు చెందిన వారు కావడంతో విద్యావంతులు, పట్టభద్రుల్లో జోరుగా చర్చ కొనసాగుతుంది. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురిలో ఇద్దరు, లేక ఒక్కరు గెలిచినా కరీంనగర్‌కు గర్వకారణం అవుతుంది.

    కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసులు చాలా మంది హైద్రాబాద్ ప్రాంతంలో స్థిర పడ్డవారు ఉన్నారు. పట్ట భద్రులు , విద్యావంతులు అనేక మంది ఇక్కడి వారు ఉన్నారు. హైకోర్టులో సికింద్రాబాద్ కోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అక్కడ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటుహక్కు కలిగిన వారు వేల సంఖ్యలో ఉంటారు. వీరు ఎటువైపు మొగ్గుచూపు తున్నరన్నదే కీలకం కానుంది. ఎల్‌.రమణ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అక్కడే స్థిరపడ్డారు . ఆయనకు బీసీ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీపై పోటీ చేస్తుండటం ఉనికి కోసమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓటమి పాలైన అనంతరం కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో గెలుపొందారు. ఎల్.రమణ కూడ అదే మార్గం ఎంచుకున్నా రమణకు కలసి వస్తుందా అన్నది అనుమానమే.. రమణ పార్టీ ఉనికి కోసం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పోటీలో ఉన్నారని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. రమణ ఏ మేరకు పట్టభద్రుల్లో పట్టు సాధిస్తారో చూడాలి.

    హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీలో ఉన్న సురబి వాణిదేవి పీవీ నరసింహా రావు కూతురు, విద్యావంతురాలు. సీఎం కేసీఆర్ ఏరికోరి ఎంపిక చేశారు. వాణిదేవి గెలుపుకోసం ఇక్కడి అధికార పార్టీ మంత్రులు, నేతలు హైదరాబాద్ లో అడ్డావేశారు. వీరి ఎత్తులు ఫలిస్తాయా అన్నది చూడాలి. హైదరాబాద్ తరువాత ఎక్కువగా ఉమ్మడి జిల్లా వాసులు వరంగల్‌లో నివాసమేర్పాటు చేసుకున్నవారు ఉన్నారు. వరంగల్ కేయూ మరియు హైదరాబాద్‌లో ప్రొపెసర్‌గా పనిచేసిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కుడా పోటీ పడుతున్నారు టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. వరంగల్‌లో సిద్ధపడ్డవారు ఎక్కువగా ప్రొఫెసర్ కోదండరాంవైపు మొగ్గుచూపు తున్నట్లు ప్రచారం జరుగుతుంది . కోదండరాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాడే కావడం విశేషం ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారో చూడాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Karimnagar, Telangana, Telangana mlc election, Telangana Politics

    తదుపరి వార్తలు