కేటీఆర్‌తో పాటు హరీష్ కూడా రంగంలోకి.. గెలుపే ప్రధాన లక్ష్యం..

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కోసం టీఆర్‌ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న.. ఆర్థిక మంత్రి హరీష్ రావును రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 10, 2019, 1:28 PM IST
కేటీఆర్‌తో పాటు హరీష్ కూడా రంగంలోకి.. గెలుపే ప్రధాన లక్ష్యం..
కేటీఆర్,హరీశ్ రావు(ఫైల్ ఫోటో)
  • Share this:
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక.. టీఆర్‌ఎస్ సర్కారు రెండో దఫా పాలనకు నిలువుదట్టంగా భావిస్తున్న ఎన్నిక. రెండో సారి సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక ఆయన సర్కారు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పథకాలు.. ఆ నియోజకవర్గంలో గెలుపుకు అవకాశం కల్పిస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డికే మరోసారి టికెట్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో షాక్ తగలడంతో, ఈ ఉప ఎన్నికలోనైనా పరువు నిలబెట్టుకోవాలని గులాబీ బాస్ అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సైదిరెడ్డి గెలుపు కోసం నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహించారు. కేసీఆర్ సర్కారు చేపట్టిన పథకాలను వివరిస్తూనే, ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. అయినా, పార్టీ గెలుపుపై కేసీఆర్‌కు నమ్మకం కలగడం లేదని సమాచారం. ఈ సమయంలోనే ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడం, వారిని తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం లాంటి ఘటనలు జరిగాయి. ఇవి పార్టీ గెలుపును భారీగా దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిసినా.. దసరా వేళ సరిపడా బస్సులు నడవకపోవడం, దాని వల్ల ప్రయాణికులు ఎదుర్కొన్న సమస్యలు ప్రభుత్వంపై అసహనానికి దారి తీశాయని చెబుతున్నారు.

అయితే, ఈ డ్యామేజీని రికవర్ చేసుకోవడానికి టీఆర్‌ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న.. ఆర్థిక మంత్రి హరీష్ రావును రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాలా సందర్భాల్లో, చాలా చోట్ల పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన హరీష్ అయితే.. ఓటర్లను ఆకట్టుకోగలరని, తన వాక్పటిమతో ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టగలరని భావించే సీఎం ఆయన్ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. చివరి రెండు లేదా మూడు రోజుల్లో హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా హరీష్ రావు సుడిగాలి పర్యటనలు చేపట్టే అవకాశం ఉంది. హరీష్ ప్రచారం నిర్వహిస్తే గెలుపు అవకాశాలు మెరుగవుతాయని, అసలు.. ఇప్పటికే ప్రచారంలో పాల్గొని ఉంటే బాగుండేదని విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చివరి రోజుల్లోనైనా హరీష్ ప్రచారం చేస్తే ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారతాయో? లేదో? వేచి చూడాల్సిందే.
Published by: Shravan Kumar Bommakanti
First published: October 10, 2019, 10:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading