తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: లగడపాటి సర్వేకు ఎందుకంత క్రేజ్...?

Lagadapati rajagopal survey - Exit Poll 2018 | సర్వేల విషయంలో ఇప్పటివరకు తన విశ్వసనీయతను కాపాడుకుంటూ వస్తున్న లగడపాటి రాజగోపాల్... ఈ సారి ఎన్నికల ఫలితాలను విశ్లేషించే విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తారని చాలామంది భావిస్తున్నారు.

news18-telugu
Updated: December 7, 2018, 6:35 PM IST
తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: లగడపాటి సర్వేకు ఎందుకంత క్రేజ్...?
లగడపాటి రాజగోపాల్( ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: December 7, 2018, 6:35 PM IST
లగడపాటి రాజగోపాల్... ఈ పేరు చెబితే తెలంగాణవాదులు మండిపడుతుంటారు. ఆయన ఏం మాట్లాడినా... తెలంగాణకు వ్యతిరేకమే అన్నది చాలామంది తెలంగాణవాసుల భావన. తెలంగాణ ఉద్యమ సమయంలో తీసుకున్న సమైక్యవాద నినాదం... దానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరించిన తీరు ఇందుకు కారణం. తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి అందుకు తగ్గట్టుగానే పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే తనకు ఆసక్తి ఉన్న సెఫాలజీని (ఎన్నికల్లో ప్రజల నాడిని తెలుసుకునేందుకు సర్వేలు చేయించే వ్యక్తి) కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సారి తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉండబోతోందో అనే అంశంపై టీజర్ విడుదల చేసిన లగడపాటి రాజగోపాల్... మొదట ఎన్నికల్లో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పిన సంచలనం సృష్టించారు. వారిలో కొందరి పేర్లను ప్రకటించి ఎన్నికల సినిమాను రక్తికట్టించారు. ఆ తరువాత మరోసారి మీడియా ముందుకు వచ్చిన లగడపాటి... ప్రజల నాడి ఏయే జిల్లాల్లో ఎవరి వైపు ఉందనే దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. తన సర్వే పూర్తి వివరాలను 7వ తేదీ సాయంత్రం ప్రకటిస్తానని చెప్పిన ఆంధ్రా అక్టోపస్... ప్రస్తుతానికి ప్రజానాడి ప్రజాకూటమికి అనుకూలంగా ఉందని వెల్లడించారు. దీంతో టీఆర్ఎస్ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

ముందే కూసిన లగడపాటి

గతానికి కాస్త భిన్నంగా ఈ సారి ఎన్నికలకు ముందే తన సర్వే ఫలితాలకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు లగడపాటి. దీంతో ఆయన చంద్రబాబు ఒత్తిడి మేరకే ఇలా చేశారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు.  ఇవన్నీ ఎలా ఉన్నా... సర్వేల విషయంలో ఆయన తనకున్న విశ్వసనీయతను దెబ్బతీసుకునేలా వ్యవహరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ సర్వే చేయించి ప్రజల మనసులో ఏముందో చెప్పిన రాజగోపాల్... 2014 ఎన్నికలకు ముందు సర్వే చేయించి ఫలితాలను ముందుగానే పసిగట్టడంలో విజయం సాధించారు. మిగతా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేని విధంగా టీఆర్ఎస్ 50 నుంచి 60 సీట్లు సాధించి అధికారానికి దగ్గరగా వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ 30 నుంచి 40, టీడీపీ, బీజేపీ కూటమి 18 నుంచి 22 స్థానాలు, ఎంఐఎం 7 నుంచి 9 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేశారు. మిగతా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌తో పోలిస్తే లగడపాటి చెప్పిన సర్వే ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ లగడపాటి చెప్పిన సీట్లకు కాస్త అటు ఇటుగా సాధించి టీడీపీ అధికారంలో వచ్చింది.ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు ?
2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల నాడిని ఒడిసిపట్టుకోవడంలో విజయం సాధించిన లగడపాటి... ఈ సారి ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు వ్యతిరేక వాతారణం ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రకటించే సర్వే ఫలితాల్లో ఎవరికి మొగ్గు ఇస్తారనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. సర్వేల విషయంలో ఇప్పటివరకు తన విశ్వసనీయతను కాపాడుకుంటూ వస్తున్న లగడపాటి రాజగోపాల్... ఈ సారి ఎన్నికల ఫలితాలను విశ్లేషించే విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తారని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ముగిసిన లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సర్వే అంచనాలను ప్రకటిస్తారు ? ముందస్తుగా ఎవరి విజయాన్ని ఖరారు చేస్తారనే అంశం ఉత్కంఠ రేపుతోంది.
    Loading...
  • తెలంగాణ ఎన్నికలు 2018: లగడపాటి ఎగ్జిట్ పోల్స్‌పై సర్వత్రా ఆసక్తి

First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...