Home /News /politics /

TELANGANA EX MP KONDA VISHWESHWAR REDDY STILL CONFUSING POLITICAL CIRCLES AK

Telangana: బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో మాజీ ఎంపీ.. కన్ఫ్యూజన్‌ కొనసాగిస్తున్నారా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Politics: ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ టీఆర్ఎస్‌తో గట్టిగా పోరాటం చేస్తుందని ఆయన నమ్మితే.. ఆ పార్టీ తరపున ఆయన ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

    తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ, కాంగ్రెస్ చెప్పుకుంటున్నాయి. రెండు పార్టీలు బలం పుంజుకుని టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. అయితే ఈ రేసులో కాంగ్రెస్ కంటే బీజేపీ కాస్త ముందున్నట్టు కనిపిస్తోంది. అయితే టీఆర్ఎస్‌ను పూర్తిస్థాయిలో ఢీ కొట్టే విపక్షం ఎవరన్న విషయంపై మరికొన్ని నెలల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రెండు పార్టీలకు చెందిన నేతలతో సఖ్యత కొనసాగిస్తున్న టీఆర్ఎస్ మాజీ తీరు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో టీఆర్ఎస్ తరపున చేవేళ్ల ఎంపీగా వ్యవహరించిన విశ్వేశ్వర్ రెడ్డి.. ఆ తరువాత ఆ పార్టీతో విబేధించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నా.. రాజకీయాల్లో మాత్రం కొనసాగుతున్నారు.

    అయితే విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. కొన్నిసార్లు కాంగ్రెస్‌కు మద్దతుగా, మరికొన్ని సార్లు బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని బహిరంగంగానే ప్రజలకు పిలుపునిచ్చారు విశ్వేశ్వర్ రెడ్డి. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే విశ్వేశ్వర్ రెడ్డి తీరు చూస్తున్న వాళ్లు మాత్రం.. రాజకీయంగా ఆయన సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని చర్చించుకుంటున్నారు.

    Konda Vishweshwar Reddy news, Konda Vishweshwar Reddy latest news, trs news, Konda Vishweshwar Reddy into bjp, Konda Vishweshwar Reddy to join bjp, telangana news, కొండా విశ్వేశ్వర్ రెడ్డి న్యూస్, టీఆర్ఎస్ న్యూస్, బీజేపీ న్యూస్, <a href='/tag/telangana/'><h5 class=తెలంగాణ న్యూస్" width="1200" height="800" class="size-full wp-image-814880" /> కొండా విశ్వేశ్వర్ రెడ్డి(ఫైల్ పొటో)


    ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ టీఆర్ఎస్‌తో గట్టిగా పోరాటం చేస్తుందని ఆయన నమ్మితే.. ఆ పార్టీ తరపున ఆయన ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే తనకు రాజకీయంగా టీఆర్ఎస్ ప్రధాన శత్రువు అని.. ఆ పార్టీని దెబ్బకొట్టే ఆ పార్టీకైనా మద్దతు ఇచ్చేందుకు ఆయన సిద్ధపడుతున్నారనే చర్చ సాగుతోంది. రాజకీయంగా ఈ రకమైన వ్యవహారశైలితో ముందుకు సాగితే.. భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

    Revanth Reddy: కాంగ్రెస్‌ హైకమాండ్ రేవంత్ రెడ్డికి జై కొడుతుందా ?.. ఆ విషయంలో ఏం చేస్తుంది ?

    Etela Rajendar: ఈటల రాజేందర్‌ను నమ్ముకున్న ఆ నేత ఇబ్బందిపడుతున్నారా ?

    అయితే ఆర్థికంగానూ బలంగా ఉన్న నాయకుడు కావడంతో... విశ్వేశ్వర్ రెడ్డి ఈ రకంగా వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో చాలామంది రాజకీయ నాయకులు ఇదే ధోరణిలో ఉన్నారని.. అయితే విశ్వేశ్వర్ రెడ్డి బహిరంగంగా రెండు పార్టీల నేతలతో సన్నిహితంగా ఉండటం వల్లే ఈ చర్చ జరుగుతోందనే వాదన కూడా ఉంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ ఎంపీగా గెలవడం.. అది కూడా టీఆర్ఎస్‌ను ఓడించే పార్టీ తరపున పోటీ చేయాలని విశ్వేశ్వర్ రెడ్డి గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Konda Vishweshwar reddy, Telangana

    తదుపరి వార్తలు