Home /News /politics /

TELANGANA EX MINISTER ETELA RAJENDAR TO JOIN BJP ON JUNE 14 IN PRESENCE OF JP NADDA AND OTHER LEADERS AK

Etela Rajendar: బీజేపీలో ఈటల చేరికకు ముహూర్తం ఖరారు... ఆ రోజే.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

ఈటల రాజేందర్(ఫైల్ ఫొటో)

ఈటల రాజేందర్(ఫైల్ ఫొటో)

Etela Rajendar: ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ కూడా కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు.

  మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు సంబంధించిన ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గం నుంచి బహిష్కరణకు గురైన ఈటల రాజేందర్.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. దీంతో ఆయన ఆ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. అయితే ఆయన ఎఫ్పుడు పార్టీలో చేరతారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఆయన బీజేపీలో చేరే ముహూర్తంపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఈ 14న ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

  ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ కూడా కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ సమావేశంలో తెలిపారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈటల రాజేందర్, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ 14న బీజేపీలోకి వస్తారని బండిసంజయ్ తెలిపారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Etela rajender, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు