TELANGANA EX MINISTER ETELA RAJENDAR CHANGED HIS PLAN REGARDING RESIGNATION ON MLA POST AK
Etela Rajendar: మారిన ఈటల ప్లాన్.. అప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. ఆ పార్టీలో టెన్షన్
ఈటల రాజేందర్( ఫైల్ ఫోటో)
Etela Rajendar: బీజేపీలో చేరే విషయంలో ఈటల రాజేందర్ తుది నిర్ణయం తీసుకున్నారా లేక ఇందుకోసం మరింత సమయం తీసుకోవాలని భావిస్తున్నారా ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అయితే ఆ దిశగా ఆయన ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కొత్త చర్చకు తావిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో ఈటల రాజీనామా సాధారణమేనా లేక దీని వెనుక ఏదైనా వ్యూహం దాగి ఉందా ? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఈటల.. ఇందుకోసం ముందుగానే ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమై వచ్చారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఆయన సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారు.
అయితే బీజేపీలో చేరే విషయంలో ఆయన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో బీజేపీలో చేరే విషయంలో ఆయన తుది నిర్ణయం తీసుకున్నారా లేక ఇందుకోసం మరింత సమయం తీసుకోవాలని భావిస్తున్నారా ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారణంగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో తాత్సారం చేస్తున్నారేమో అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లడానికి ముందే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని.. ఆ తరువాత ఢిల్లీ విమానం ఎక్కుతారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ విషయంలో ఈటల రాజేందర్ వ్యూహం ఏమిటనే అంశం ఆయన సన్నిహితులకు కూడా అర్థంకావడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.