Eetala Rajender: ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్.. బీజేపీలో చేరిక ఖాయమేనా..?

Eetala Rajender :స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించనున్న ఈటల ..పదకొండు గంటలకు ముహుర్తం ఫిక్స్

బీజేపీలో చేరికపై ఆయన ఇప్పటి వరకైతే క్లారిటీ ఇవ్వలేదు. కానీ బీజేపీ నేతలతో వరుస సమావేశాల తర్వాత ఆయన బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అతి త్వరలో క్లారిటీ రానుంది.

  • Share this:
    తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆయన ఎవరిని కలుస్తారు? బీజేపీ పెద్దలతో భేటీ ఉంటుందా? ఈ పర్యటనలోనే ఆయన బీజేపీలో చేరతారా? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బీజేపీలో చేరికపై ఆయన ఇప్పటి వరకైతే క్లారిటీ ఇవ్వలేదు. కానీ బీజేపీ నేతలతో వరుస సమావేశాల తర్వాత ఆయన బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అతి త్వరలో క్లారిటీ రానుంది.

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈటల రాజేందర్


    బీజేపీలో ఈటల రాజేందర్‌కు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం వర్చువల్ భేటీలో చర్చించారు. ఆ భేటీ అనంతరం బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు జేపీ నడ్డా పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

    ఇక రెండు రోజుల క్రితం శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత ప్రొ. కోదండరామ్ ఆయనతో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరతారని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో వీరు ఆయన్ను కలిశారు. బీజేపీలో చేరవద్దని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఐక్య వేదికను ఏర్పాటు చేద్దామని సూచించారు. ఈటలకు నైతికంగా మద్దతు తెలిపేందుకే ఇక్కడకు వచ్చామని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒకవేళ నిజంగానే ఈటల తప్పు చేసి ఉంటే.. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈటలపై జరిగిన రాజకీయ దాడిని ఆత్మగౌరవ దాడిగా అభివర్ణించారు ప్రొ. కోదండరామ్.

    బీజేపీలో చేరిన అనంతరం.. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీనామా ప్రకటిస్తారని సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత.. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ పోటీచేయబోడని ప్రచారం జరుగుతోంది. ఆయనకు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తుందని.. అనంతరం కేంద్రమంత్రి పదవి ఇవ్వనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్‌లో ఈటల సతీమణి జమున పోటీ చేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: