Huzurabad: బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి మాజీమంత్రి రాజీనామా.. ఉప ఎన్నికకు ముందే..

బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Huzurabad: మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు పెద్దిరెడ్డి.

  • Share this:
    హుజూరాబాద్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీలో కొనసాగుతున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా లేఖను పంపారు. పార్టీలో కొనసాగేందుకు మనసు అంగీకరించడం లేదని అందులో వివరించారు. మారిన రాజకీయాల దృష్ట్యా పార్టీలో కొనసాగలేనని లేఖలో తెలిపారు. మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు పెద్దిరెడ్డి. ఈటల రాకతో తనకు భవిష్యత్తులోనూ బీజేపీ తరపున హుజూరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం రాకపోవచ్చని భావించిన పెద్దిరెడ్డి.. కమలం పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరిగింది. అయితే బీజేపీ నేతలు మాత్రం పెద్దిరెడ్డిని బుజ్జగించి ఆయన పార్టీలోనే కొనసాగేలా చేసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు.

    మాజీమంత్రి డీకే అరుణ పెద్దిరెడ్డితో పలుసార్లు చర్చలు జరిపారు. పార్టీలో ప్రాధాన్యత దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే పెద్దిరెడ్డి మాత్రం బీజేపీలో కొనసాగే విషయంలో అయిష్టంగానే ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఆ నియోజకవర్గంలో కొంతవరకు పట్టున్న ఇనుగాల పెద్దిరెడ్డి.. బీజేపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి మైనస్‌గా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

    Etela Rajendar news, peddireddy news, telangana news, etela rajendar versus peddireddy, ఈటల రాజేందర్, పెద్దిరెడ్డి న్యూస్, తెలంగాణ న్యూస్, ఈటల రాజేందర్ వర్సెస్ పెద్దిరెడ్డి
    అమిత్ షాతో ఇనుగాల పెద్దిరెడ్డి (ఫైల్ ఫోటో)


    మరోవైపు బీజేపీకి గుడ్ బై చెప్పిన పెద్దిరెడ్డి.. ఏ పార్టీలో చేరతారనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన టీఆర్ఎస్‌లోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని కొందరి భావిస్తుంటే.. పెద్దిరెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం లేకపోలేదని మరికొందరు చర్చించుకుంటున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: