అనుకూలంగా ఉంటే ఓకే, లేకపోతే కుట్రా?: లగడపాటి రాజగోపాల్

TelanganaElections2018: కేటీఆర్ అడిగితేనే తాను సాయం చేశానని, నిజం చెబితే ఆయన జీర్ణం చేసుకోలేకపోయారని లగడపాటి రాజగోపాల్ తెలిపారు.

news18-telugu
Updated: December 5, 2018, 12:36 PM IST
అనుకూలంగా ఉంటే ఓకే, లేకపోతే కుట్రా?: లగడపాటి రాజగోపాల్
లగడపాటి రాజగోపాల్, కేేటీఆర్
  • Share this:
తన సంస్థ చేసే సర్వేలు ప్రకటించడం, ప్రకటించకపోవడం అన్నీ తన ఇష్టమని లగడపాటి రాజగోపాల్ అన్నారు. అవి ఫలితాలపై ప్రభావం చూపిస్తాయంటే అది అన సమస్య కావన్నారు. రాజకీయాల్లో ఎవరూ అహంకారం, అహంభావం చూపించకూడదని కేటీఆర్, కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌కు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. కేటీఆర్ కోరితేనే ఆయనకు తాను సాయం చేశానని, సర్వే వివరాలు పాజిటివ్‌గా వచ్చినా, నెగిటివ్‌గా వచ్చినా ఆయనకు తెలియజేశానని లగడపాటి అన్నారు. అయితే, పాజిటివ్‌గా వచ్చినప్పుడు దాన్ని ప్రచారం చేసుకుని, నెగిటివ్‌గా రాగానే తన మీద నిందలు వేయడాన్ని లగడపాటి తప్పుపట్టారు.

కేటీఆర్, లగడపాటి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ
కేటీఆర్, లగడపాటి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ


నాకు పదవులు ముఖ్యం కాదు. వ్యక్తిత్వం ముఖ్యం. నేను ఎవరి ఒత్తిడితోనూ సర్వే వివరాలు మార్చలేదు. నవంబర్‌ 11న 37 సెగ్మెంట్ల వివరాలు కేటీఆర్‌కు పంపా. అప్పుడు అత్యధిక శాతం కాంగ్రెస్‌ వైపే ఉంది. అయితే, గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉందని కేటీఆర్ చెప్పారు. 11న రిజల్ట్స్ మీరే చూస్తారని కేటీఆర్ మెసేజ్ పంపారు.
లగడపాటి రాజగోపాల్


కేటీఆర్, లగడపాటి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ
కేటీఆర్, లగడపాటి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ


మంగళవారం రోజు ప్రెస్ మీట్‌లో వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉందని చెప్పిన లగడపాటి రాజగోపాల్.. ఇప్పుడు అక్కడ కూడా సీన్ మారిందన్నారు. బుధవారం ఉదయం నాటికి అందిన సమాచారం ప్రకారం వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని చెప్పారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ వన్ సైడ్‌గా గెలవొచ్చన్నారు. టీఆర్ఎస్ పార్టీకి డబుల్ బెడ్ సమస్య ఉందని తెలిపారు. మైనారిటీలు వేగంగా మారుతున్నారని లగడపాటి అన్నారు.

కేటీఆర్, లగడపాటి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ
కేటీఆర్, లగడపాటి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ
అక్టోబర్ 28న గజ్వేల్ వెళ్లా. వెహికల్ చెక్ చేస్తున్న పోలీసులు నన్ను గుర్తుపట్టారు. కారు దిగమని చెప్పి నాతో సెల్ఫీలు తీసుకున్నారు. గజ్వేల్‌లో ఎవరు వస్తారని అడిగితే, పోతారని ఏడుగురు కానిస్టేబుళ్లు చెప్పారు. ఎవరు పోతారో నేను చెప్పను.
లగడపాటి రాజగోపాల్


సెప్టెంబర్‌లో కేటీఆర్ తనను కలిసినప్పుడు టీఆర్ఎస్, టీడీపీ కలసి వెళితే బాగుంటుందని చెప్పానని లగడపాటి తెలిపారు. అప్పటి వరకు టీడీపీ ఓట్ బ్యాంక్ టీఆర్ఎస్ వైపు మళ్లిందన్నారు. అయితే, కాంగ్రెస్ - టీడీపీ కలిసిన తర్వాత ఆ ఓట్ బ్యాంక్ మళ్లీ టీడీపీ వైపే వచ్చిందన్నారు. ఈ విషయం తాను కేటీఆర్‌కు కూడా చెప్పానని లగడపాటి తెలిపారు.

కేటీఆర్, లగడపాటి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ
కేటీఆర్, లగడపాటి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ


అమెరికా వెళ్లిపోతానంటూ కేటీఆర్ నాతో చిట్ చాట్ చేయలేదు. కేటీఆర్, నాకు మధ్య జరిగిన సంభాషణ అంటూ చక్కర్లు కొడుతున్న వార్తలతో మాకు సంబంధం లేదు. కేసీఆర్ తిట్టడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని చెప్పా. అయితే, కేటీఆర్ చాకచక్యంగా సర్దిచెబుతున్నారని కూడా వెల్లడించా.
లగడపాటి రాజగోపాల్


లగడపాటి రాజగోపాల్ ఫుల్ ఇంటర్వ్యూ
Published by: Ashok Kumar Bonepalli
First published: December 5, 2018, 11:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading