మా గెలుపు ఖాయం, కేసీఆర్ బాడీలాంగ్వేజ్ అందుకు సాక్ష్యం: ప్రజాకూటమి

Telangana Elections 2018: తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు పెత్తనం సాగుతుందని కేసీఆర్ చేస్తున్న ఆరోపణలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

news18-telugu
Updated: December 5, 2018, 5:02 PM IST
మా గెలుపు ఖాయం, కేసీఆర్ బాడీలాంగ్వేజ్ అందుకు సాక్ష్యం: ప్రజాకూటమి
ప్రజాకూటమి నేతల భేటీ
  • Share this:
తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరగా ప్రజాకూటమి నేతలు అందరూ ప్రెస్ మీట్‌ ఏర్పాటు చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. మోడ్రన్ స్టేట్‌గా అవుతుందని తాము భావిస్తే, రాష్ట్రంలో అవినీతి పెరిగిందని చెప్పారు. రైతులు, యువత, నిరుద్యోగుల కోసం తాము పోరాడుతున్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారనే ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం దాటవేశారు. ఈ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టమన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే  ప్రజాకూటమి గెలుస్తుందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు కలసి పనిచేస్తారని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని తాము కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు చంద్రబాబు చెప్పారు. జాతీయ రాజకీయాల్లో మార్పునకు ఇది ఆరంభమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో నెం.1 కావాలన్న చంద్రబాబు, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సీఎం ఉంటారన్న చంద్రబాబు, రాష్ట్ంలో తాము జోక్యం చేసుకోబోమన్నారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన విధానం చూస్తుంటే ఆయన ఓడిపోతున్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

టీఆర్ఎస్‌ను గద్దె దించకుండా ఈ రాష్ట్రం బాగుపడదని కోదండరాం అన్నారు.. టీఆర్ఎస్‌ను గద్దెదించడానికి సమయం వచ్చిందని, దించుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఎలా పోరాడామో, హామీల అమలు కోసం అంతే స్థాయిలో ప్రయత్నిస్తాంమని కోదండరాం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అహంకారపూరిత, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. అందుకే సిద్ధాంతపరమైన విబేధాలు ఉన్నా కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు.

తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు పెత్తనం సాగుతుందని కేసీఆర్ చేస్తున్న ఆరోపణలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 5, 2018, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading