తెలంగాణలో మార్పు తుఫాన్ వస్తోంది: రాహుల్ గాంధీ

Telangana Elections 2018: ‘కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావు’ అని తెలంగాణ ప్రజలు కొత్త పేరు పెట్టారని రాహుల్ గాంధీ చెప్పారు. గత నాలుగేళ్లలో కేటీఆర్ ఆదాయం 400శాతం పెరిగిందన్నారు.

news18-telugu
Updated: December 5, 2018, 3:23 PM IST
తెలంగాణలో మార్పు తుఫాన్ వస్తోంది: రాహుల్ గాంధీ
కోదాడ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ
  • Share this:
తెలంగాణ ఎన్నికల్లో మార్పు తుఫాన్ వస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కోదాడలో జరిగిన ప్రజాకూటమి సభలో చంద్రబాబుతో కలసి రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కేసీఆర్ మీద, మోదీ మీద విమర్శలు గుప్పించారు. తెలంగాణలో 35లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పిన రాహుల్ గాంధీ, ప్రజాకూటమి అధికారంలోకి వస్తే, బడ్జెట్‌లో 20శాతం నిధులను నిరుద్యోగుల స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తామన్నారు. మేడిన్ తెలంగాణ, మేడిన్ నల్లగొండ కావడమే తమ లక్ష్యమన్నారు.

మొన్న కేసీఆర్ వచ్చి నల్లగొండను దత్తత తీసుకుంటానన్నారు. ఆయన ప్రతి జిల్లాలోనూ ఇదే మాట చెబుతున్నట్టున్నారు. కేసీఆర్ నిజంగా దత్తత తీసుకోవాలనుకుంటే రైతులను దత్తత తీసుకోండి. నిరుద్యోగ యువతను దత్తత తీసుకోండి. అమరవీరుల కుటుంబాలను దత్తత తీసుకోండి. లక్షలాది మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. వారందరినీ దత్తత తీసుకోండి.

కోదాడ సభలో రాహుల్ గాంధీ


తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావు’ అని తెలంగాణ ప్రజలు కొత్త పేరు పెట్టారని రాహుల్ గాంధీ చెప్పారు. గత నాలుగేళ్లలో కేటీఆర్ ఆదాయం 400శాతం పెరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రం మీద అప్పు లేదని, ఇప్పుడు రూ.2.50లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ప్రతి కుటుంబం మీద రూ.2.50 లక్షల అప్పు ఉందని రాహుల్ తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునర్నిర్మిస్తామన్న రాహుల్ గాంధీ నల్గొండకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కేసీఆర్, మోదీ మధ్య పార్ట్‌నర్ షిప్ ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ సభల్లో ఎక్కడా కేసీఆర్‌ను తిట్టడంలేదని, తనను చంద్రబాబును మాత్రమే తిడుతున్నారని చెప్పారు. ‘టీఆర్ఎస్ అంటే టీ-ఆర్ఎస్ఎస్’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 5, 2018, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading