తెలంగాణ ఎన్నికలపై మరో సర్వే ఫలితావిగో..

Telangana Election 2018 | తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పూటకో సర్వే బయటకు వస్తోంది. వాటి విశ్వసనీయత ఎంతనే విషయం పక్కనపెడితే.. ఆ సర్వేలు జనాలను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా విడుదలైన మరో సర్వే.. సంచలనం రేపుతోంది.

Santhosh Kumar Pyata | news18-telugu
Updated: December 3, 2018, 7:25 PM IST
తెలంగాణ ఎన్నికలపై మరో సర్వే ఫలితావిగో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందడి మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వే బయటికి వస్తూ.. జనాలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒక సర్వే అధికార పార్టీకి, మరో సర్వే ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుండడంతో ఏది నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఆ సర్వేల వివరాలు చక్కర్లు కొడుతుండడంతో... మీ సర్వేలకో దండం అంటున్నారు జనాలు.

పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ తెలంగాణ ఎన్నికలపై తాజాగా మరో సర్వే విడుదలైంది. పల్స్ ఆఫ్ ఓటర్స్ (Pov)అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని తేల్చింది.

మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 60 స్థానాలు అవసరంకాగా... అధికార టీఆర్ఎస్ పార్టీకి 77 సీట్లు దక్కుతాయని వెల్లడించింది. ఇక   కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 23 (కాంగ్రెస్ 20+టీడీపీ3) సీట్లు సాధిస్తుందనేది ఈ సర్వే సారాంశం.


అటు తక్కువలో తక్కువ 10 స్థానాల్లో గెలిచి కింగ్ మేకర్ కావాలనుకుంటున్న బీజేపీ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే తేల్చింది. సీపీఎం నేతృత్వంలోని బీఎల్ఎఫ్ 2 స్థానాలు, బీఎస్పీ 2, స్వతంత్రులు 5, ఎంఐఎం 7 సీట్లు గెలుస్తాయని సర్వే వెల్లడించింది. మహాకూటమిలో భాగమైన టీజేఎస్, సీపీఐ ఒక్కస్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశం లేదని సర్వే చెబుతోంది.

ఇక, ఈ సర్వే ప్రకారం పాత జిల్లాల వారిగా ఫలితాలను చూస్తే, ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ 6, కాంగ్రెస్ 2, బీఎస్పీ 1, ఇతరులు 1 సీటు కైవసం చేసుకుంటారని తెలుస్తోంది. నిజామబాద్‌లో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 1, బీజేపీ 1 .. కరీంనగర్‌లో టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 2, ఇతరులు 1.. మెదక్‌లో టీఆర్ఎస్ 8,కాంగ్రెస్ 2 స్థానాలు.. రంగారెడ్డిలో టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 2, బీఎస్పీ 1.. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ 6, ఎంఐఎం 7, బీజేపీ 2 స్థానాలు.. మహబూబ్ నగర్‌లో టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3, బీఎస్పీ 1, ఇతరులు 1.. నల్గొండలో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 3, బీఎస్పీ 1.. వరంగల్‌లో టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3 స్థానాలు.. ఖమ్మంలో టీఆర్ఎస్ 4, టీడీపీ 3, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటాయని సర్వే వెల్లడించింది.

పల్స్ ఆఫ్ ఓటర్స్ నిర్వహించిన సర్వేలో...పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, మహాకూటమి అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీల అభ్యర్థుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా కేవలం 1 నుంచి 3 శాతం మాత్రమే. ఇక కాంగ్రెస్ రెబల్స్, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న కొన్ని స్థానాల్లో ముక్కోణ పోటీ, కొన్ని చోట్ల చదుర్ముఖ పోటీ నెలకొంటున్నట్లు ఆ సర్వేలో వెల్లడయ్యింది.
First published: December 3, 2018, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading