తెలంగాణలో ప్రజానాడి హస్తం వైపే: లగడపాటి జోస్యం

Telangana elections 2018- Lagadapati Survey results | ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజానాడి హస్తం వైపే ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలవబోయే మరో ముగ్గురు ఇండిపెండెంట్ల పేర్లను ప్రకటించారు.

news18-telugu
Updated: December 4, 2018, 8:11 PM IST
తెలంగాణలో ప్రజానాడి హస్తం వైపే: లగడపాటి జోస్యం
లగడపాటి రాజగోపాల్
  • Share this:
తెలంగాణలో గెలిచే ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించి సంచలనం సృష్టించిన లగడపాటి రాజగోపాల్...మరో ముగ్గురు పేర్లను ప్రకటించారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి, బోథ్ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అనిల్ జాదవ్ ‌గెలుస్తారని ప్రకటించిన ఆంధ్రా అక్టోపస్... తాజాగా మరో ముగ్గురి పేర్లను ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ టికెట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ రెబల్ మల్ రెడ్డి రంగారెడ్డి, బెల్లంపల్లి నుంచి టీఆర్ఎస్ రెబల్‌గా బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి జి. వినోద్, మక్తల్ నుంచి టీఆర్ఎస్ రెబల్ జలంధర్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

పోలింగ్ శాతం మార్పు లేకపోతే హంగ్... పోలింగ్ శాతం పెరిగితే మహాకూటమికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక జిల్లాల వారీగా ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో మహాకూటమి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం ఆధిక్యత కనబరుస్తుందని అన్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్‌లో హోరాహోరీ. నిజామాబాద్, మెదక్, వరంగల్‌లో టీఆర్ఎస్ హవా ఉంటుందని విశ్లేషించారు. ప్రస్తుతం ప్రజానాడి హస్తం వైపే ఉందని అన్నారు.

తెలంగాణలో ఓటింగ్ శాతం 68.5 మించితే మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. అంతకంటే తక్కువగా ఓటింగ్ శాతం ఉంటే మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే బీజేపీకి సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ సారి జిల్లాల్లో కూడా బీజేపీకి సీట్ల సంఖ్య పెరుగుతుంది.
లగడపాటి రాజగోపాల్, మాజీ ఎంపీ


ఇది కూడా చదవండి:
లగడపాటి నుంచీ ఫోన్ కాల్ వస్తే, ఎన్నికల్లో గెలిచేసినట్లేనా?
Published by: Kishore Akkaladevi
First published: December 4, 2018, 7:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading