కేసీఆర్‌పై సీబీఐ చార్జ్‌షీట్.. పేరెలా తీసేశారు?: ఉత్తమ్

#TelanganaElections2018: నరేంద్ర మోదీతో లాలూచీపడిన కేసీఆర్ సీబీఐ చార్జ్‌షీట్‌లో ఆయన పేరును తప్పించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

news18-telugu
Updated: December 1, 2018, 11:02 AM IST
కేసీఆర్‌పై సీబీఐ చార్జ్‌షీట్.. పేరెలా తీసేశారు?: ఉత్తమ్
కేసీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైల్
  • Share this:
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మీద టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈఎస్ఐ స్కాంలో అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ పేరు సీబీఐ నమోదుచేసిన చార్జిషీట్‌లో ఉందని, ఇప్పుడు అదెలా మాయమైందని ప్రశ్నించారు. నరేంద్రమోదీ లాలూచీపడిన కేసీఆర్.. తన పేరును చార్జ్ షీట్ నుంచి తప్పించారని ఉత్తమ్ ఆరోపించారు. యూపీఏ 1 హయాంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రమంత్రిగా పనిచేశారు. కార్మిక శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా నిర్మించాల్సిన మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులను, నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు కాకుండా వెలుగుబంటి సూర్యనారాయణ అనే వ్యక్తి ద్వారా మత్స్యశాఖకు అప్పగించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించి అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన పత్రాల్లో.. ఈఎస్ఐ అధికారులను ఇంటికి పిలిపించుకుని మరీ కేసీఆర్ కాంట్రాక్టును కట్టబెట్టినట్టు తెలిపిందన్నారు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసిందన్నారు.

సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో కేసీఆర్ పేరు ఉండగా, ఇప్పుడు ఆ కేసు నుంచి కేసీఆర్ పేరు తప్పించినట్టు ఉత్తమ్ ఆరోపించారు. నరేంద్రమోదీతో కుమ్మక్కు కావడం వల్లే ఇలా కేసు నుంచి తప్పించారన్నారు. మోదీతో లాలూచీ పడిన తెలంగాణ సీఎం.. రాష్ట్రానికి రావాల్సిన వాటిని కూడా సరిగా పట్టించుకోలేదని చెప్పారు.

ఉత్తమ్, కేసీఆర్
ఉత్తమ్, కేసీఆర్


మరోవైపు కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే బీడీ కట్టల మీద పుర్రె గుర్తు వచ్చిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. కేసీఆర్ వల్లే లక్షలాది మంది బీడీ కార్మికులకు నష్టం వాటిల్లిందన్నారు. సహారా సంస్థకు రూ.7000 కోట్ల పీఎఫ్ నిధులు వాడుకునేందుకు కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారని, ఇది భారీ కుంభకోణమని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ రూ.1000 కోట్లు ఖర్చు చేసిందన్న రమణ.. రాబోయే రోజుల్లో మరో రూ.1000 కోట్లు ఖర్చు చేస్తుందని సందేహం వ్యక్తం చేశారు.

tpcc president uttam kumarreddy comments on kcr, modi, oyc
ఉత్తమ్, కేసీఆర్(File)
Published by: Ashok Kumar Bonepalli
First published: December 1, 2018, 11:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading