నాలుగేళ్లలో ఇళ్లు కట్టలేని కేసీఆర్.. భవిష్యత్తులో గ్యారెంటీ ఉందా?: చంద్రబాబు

#TelganangaElectionsLive2018: నాలుగున్నరేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేని కేసీఆర్ భవిష్యత్తులో నిర్మిస్తారన్న గ్యారెంటీ ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు.

news18-telugu
Updated: November 29, 2018, 3:17 PM IST
నాలుగేళ్లలో ఇళ్లు కట్టలేని కేసీఆర్.. భవిష్యత్తులో గ్యారెంటీ ఉందా?: చంద్రబాబు
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శేరిలింగంపల్లిలో రోడ్ షో నిర్వహించారు. బీజేపీ - టీఆర్ఎస్ పార్టీలు దొంగాట ఆడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీ కొట్టినట్టు, టీఆర్ఎస్ ఏడ్చినట్టు నటించడం అలవాటైపోయిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణలో దేవాదుల, కల్వకుర్తి, బీమా ప్రాజెక్టును శాంక్షన్ చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఏ పని చేయలేదు కాబట్టే, తన మీద విమర్శలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేని టీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్తులో కడుతుందన్న గ్యారెంటీ ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. అదే సమయంలో ఏపీలో 25లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే.. 10 లక్షలకు పైగా గృహప్రవేశాలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో రెండే కూటములు ఉంటాయని చంద్రబాబు అన్నారు. ఒకటి బీజేపీ కూటమి అయితే, రెండోది బీజేపీని వ్యతిరేకించే కూటమి అన్నారు. ఇందులో కేసీఆర్ ఎక్కడ ఉంటారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.

తెలంగాణ లాంటి ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేశారని చంద్రబాబు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి అసెంబ్లీని నాలుగున్నరేళ్లలో ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. గతంలో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని, ఈ సారి అలాంటి చాన్స్ లేదన్నారు. ఈసారి మంచి అభ్యర్థులను నిలబెట్టినట్టు చెప్పారు. అయినా, రాబోయేది ప్రజాకూటమి ప్రభుత్వమే అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, తాను కలసి తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాహితం కోసం కృషి చేస్తామన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రచారం చేసిన చంద్రబాబు.. సైబరాబాద్‌ను తన మానసపుత్రికగా అభివర్ణించారు. ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందితే తాను అంత సంతోషిస్తానన్నారు.
First published: November 29, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading