తెలంగాణ ఎన్నికలు : సెటిలర్స్‌పై చంద్రబాబు ఆశలు, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజాకూటమికి కలిసొస్తుందా?

సెటిలర్ అనే పదాన్ని హైదరాబాదీల మైండ్‌లోంచీ తొలగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రా ప్రజలు కూడా హైదరాబాద్‌లో ఎలాంటి అభ్యంతరమూ లేకుండా నివసిస్తున్నారు. ఇదివరకు ఉన్న తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు లేదు. ఐతే, తెలంగాణ ఎన్నికల రణరంగంలోకి దూకిన టీడీపీ... తిరిగి సీమాంధ్రవాదాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించి... అధికార పార్టీకి సవాళ్లు విసిరింది.

news18-telugu
Updated: December 5, 2018, 1:12 PM IST
తెలంగాణ ఎన్నికలు : సెటిలర్స్‌పై చంద్రబాబు ఆశలు, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజాకూటమికి కలిసొస్తుందా?
చంద్రబాబుతో కలసి రోడ్ షోలో పాల్గొన్న నగ్మా (ఫైల్ ఫొటో)
  • Share this:
(డీ పీ సతీష్ : న్యూస్18 ప్రతినిధి)

మహాకూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన టీడీపీ అధినేత చంద్రబాబు... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి సోమవారం కూకట్‌పల్లిలో ప్రజలను ఉద్దేశించి వాడివేడిగా ప్రసంగించారు. అక్కడి వారిలో ఎక్కువ మంది సెటిలర్లే. ఆంధ్రప్రదేశ్ నుంచీ వచ్చి, తెలంగాణలో నివసిస్తున్నవారే. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి ఓటు వెయ్యాలని కోరుతూ చంద్రబాబు... పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ.... ఉత్సాహంతో ఈలలు వేస్తున్న అభిమానులను చూస్తూ... ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి గుణపాఠం చెప్పాలన్నారు.

మంగళవారం కూడా ఆయన సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే సభలు నిర్వహించారు. టీడీపీ ఆంధ్రా ఓటు కార్డును ప్రయోగించింది అనేందుకు చంద్రబాబు ప్రచారమే సాక్ష్యం. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ ఎన్నికల్లో... అత్యంత జాగ్రత్తగా అడుగులేసిన చంద్రబాబు.... టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ కాదనే భావన ప్రజల్లో కలిగేలా కొంతవరకూ ప్రయత్నించారు.. ఇదివరకు ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ప్రభావం చూపింది. అప్పట్లో సెటిలర్లు రాష్ట్ర విభజనను వ్యతిరేకించగా... తెలంగాణ ప్రజలు... టీఆర్ఎస్‌కి ఓట్లు వేసి... తమ ఆకాంక్షను చాటిచెప్పారు.

Telangana Elections 2018 : Chandrababu Naidu Goes After ‘Settler’ Vote in Hyderabad, But Avoids Tipping Anti-Telangana Narrative Scale సెటిలర్ అనే పదాన్ని హైదరాబాదీల మైండ్‌లోంచీ తొలగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రా ప్రజలు కూడా హైదరాబాద్‌లో ఎలాంటి అభ్యంతరమూ లేకుండా నివసిస్తున్నారు. ఇదివరకు ఉన్న తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు లేదు. ఐతే, తెలంగాణ ఎన్నికల రణరంగంలోకి దూకిన టీడీపీ... తిరిగి సీమాంధ్రవాదాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించి... అధికార పార్టీకి సవాళ్లు విసిరింది.telangana elections 2018, telangana elections, telangana news, telangana polls 2018, telangana assembly elections, telangana elections survey 2018, lagadapati rajagopal survey on telangana elections,latest survey on telangana elections 2018, తెలంగాణ ఎన్నికలు లగడపాటి సర్వే, తెలంగాణ ఎన్నికల ఫలితాలు
చంద్రబాబుతో ఎన్నికల ప్రచారంలో నగ్మా


టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర ఏళ్లలో... కృష్ణ, గోదావరి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. తెలంగాణ సెంటిమెంట్, యాంటీ సెటిలర్స్ సెంటిమెంట్ రెండూ కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రజలు రోజువారీ ఎదుర్కొనే సమస్యలే ప్రధానాంశాలుగా రాజకీయాలు నడిచాయి. సెటిలర్ అనే పదాన్ని తెలంగాణలోని సీమాంధ్రుల మైండ్‌లోంచీ తొలగించాలని కేసీఆర్ ప్రయత్నించారు. ఆంధ్రా ప్రజలు కూడా హైదరాబాద్‌లో ఎలాంటి అభ్యంతరమూ లేకుండా నివసిస్తున్నారు. ఐతే, తెలంగాణ ఎన్నికల రణరంగంలోకి దూకిన టీడీపీ... తిరిగి సీమాంధ్రవాదాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించి... అధికార పార్టీకి సవాళ్లు విసిరింది.

గ్రేటర్ హైదరాబాద్‌లోని ఏడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రా ఓటర్లు భారీగా ఉన్నారు. వాళ్లు మొత్తం 12 లక్షల మంది సెటిలర్లు ఉన్నట్లు అంచనా. గ్రేటర్ హైదరాబాద్‌ ప్రాంతంలో 27 అసెంబ్లీ స్థానాలున్నాయి. (14 హైదరాబాద్ నుంచీ, 13 రంగారెడ్డి జిల్లాలో). ఈ 27లో ఎంఐఎం 7 స్థానాలు కచ్చితంగా గెలుస్తామనే ధీమాలో ఉంది. 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ, ఆ పార్టీ చెక్కు చెదరని విశ్వాసంతో ఉంది.


మిగతా 20 స్థానాల్లో మహాకూటమి, టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. 2014 ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో... రెండు స్థానాల్ని మాత్రమే గెలుచుకుంది. ఎంఐఎం 7 సీట్లు, బీజేపీ 5 స్థానాలు సాధించగా.... మిగతా 12 నియోజకవర్గాల్నీ... కాంగ్రెస్, టీడీపీ కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజాకూటమి ఎక్కువ సీట్లు సాధిస్తే, అది టీఆర్ఎస్‌కు షాకిచ్చే అంశమే.కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ నియోజకవర్గాల్లో దాదాపు 40-50 శాతం ఆంధ్రా ఓటర్లు ఉన్నారు. వాళ్లు ఈసారి టీడీపీ-కాంగ్రెస్ కూటమికి ఓటు వేస్తారనే అంచనాలున్నాయి. ప్రజాకూటమి ఇక్కడ 15 సీట్లు గెలిస్తే, ఎన్నికల ఫలితాలు తారుమారవ్వడం ఖాయం. ఈ కారణంగానే మహాకూటమి పార్టీలు గ్రేటర్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాయి.

బ్రాండ్ హైదరాబాద్‌ను క్యాష్ చేసుకుంటున్న ప్రజాకూటమి... తన ప్రచారంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాయని చెబుతూ వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధిని కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించాయి. ఈ విషయంలో గ్రేటర్ ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు హైదరాబాద్‌లో చాలా సమస్యలు ఉన్నాయంటుంటే, మరికొందరు సెటిలర్స్ అనే మాటే లేదనీ, తాము తెలంగాణ వాళ్లమేనని అంటున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కాంగ్రెస్ జట్టు కట్టే పరిస్థితి ఉండటంతో... టీడీపీకి ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ, జనసేనలు ఆటోమేటిక్‌గా తెలంగాణలో టీఆర్ఎస్ లేదా బీజేపీకి ఓటు వెయ్యమని తమ అభిమానులకు పరోక్ష సంకేతాలిచ్చాయి. రాయలసీమకు చెందిన రెడ్లు జగన్మోహన్ రెడ్డికీ, కోస్తాకు చెందిన బలిజ, కాపు వర్గాలు పవన్‌కు అనుకూలంగా ఉంటూ... వాళ్లలో చాలా మంది ఇప్పుడు తెలంగాణలోని టీఆర్ఎస్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ కూడా ఎంఐఎంతో కలిసి గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ విజయం దక్కించుకోగలమనే నమ్మకంతో ఉంది.

Telangana Elections 2018 : Chandrababu Naidu Goes After ‘Settler’ Vote in Hyderabad, But Avoids Tipping Anti-Telangana Narrative Scale సెటిలర్ అనే పదాన్ని హైదరాబాదీల మైండ్‌లోంచీ తొలగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రా ప్రజలు కూడా హైదరాబాద్‌లో ఎలాంటి అభ్యంతరమూ లేకుండా నివసిస్తున్నారు. ఇదివరకు ఉన్న తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు లేదు. ఐతే, తెలంగాణ ఎన్నికల రణరంగంలోకి దూకిన టీడీపీ... తిరిగి సీమాంధ్రవాదాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించి... అధికార పార్టీకి సవాళ్లు విసిరింది. telangana elections 2018, telangana elections, telangana news, telangana polls 2018, telangana assembly elections, telangana elections survey 2018, lagadapati rajagopal survey on telangana elections,latest survey on telangana elections 2018, తెలంగాణ ఎన్నికలు లగడపాటి సర్వే, తెలంగాణ ఎన్నికల ఫలితాలు
భట్టి విక్రమార్క, రాహుల్, చంద్రబాబు(ఫైల్ ఫోటో)


2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 43.9 శాతం ఓట్లు దక్కించుకోగా... టీడీపీ, కాంగ్రెస్ మొత్తం కలిపినా వాటికి వచ్చిన ఓట్లు 25 శాతమే. "విభజించి పాలించు" అనే మహాకూటమి కుట్రలు పనిచెయ్యవన్న కేటీఆర్, ఫలితాలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వస్తాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కచ్చితంగా పై చేయి సాధిస్తామని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు... గ్రేటర్ హైదరాబాద్‌లోనూ విజయం సాధిస్తే, కేసీఆర్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చగలమని నమ్ముతున్నారు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా సెటిలర్లు ఎక్కువే. అక్కడి నుంచి కూడా తమకు మెజార్టీ సీట్లు దక్కుతాయని మహాకూటమి భావిస్తోంది. ఈ ఫలితాలతో సెటిలర్స్ అనే మాట పూర్తిగా కనుమరుగవ్వడమో లేదంటే తిరిగి పుంజుకోవడమో జరిగే అవకాశాలున్నాయి.

 

Video: తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు రూ.1,020 కోట్లు ఖర్చుచేశారు: విజయసాయిరెడ్డి


First published: December 5, 2018, 12:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading