తెలంగాణ ఎన్నికలు 2018 : సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, రంగంలోకి హైపర్ స్ట్రైకింగ్ ఫోర్స్, మావోయిస్టులకు చెక్

Telangana Elections 2018 | Polling Day | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 32, 815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 4 వేల సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించారు. వీటిలో 1,500 ప్రాంతాల్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్ర బలగాల్ని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్ట్రైకింగ్ ఫోర్స్... అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో హైపర్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎన్నికల విధుల్లో పాల్గొంటోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: December 7, 2018, 12:02 AM IST
తెలంగాణ ఎన్నికలు 2018 : సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, రంగంలోకి హైపర్ స్ట్రైకింగ్ ఫోర్స్, మావోయిస్టులకు చెక్
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: December 7, 2018, 12:02 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇదివరకు ఎప్పుడూ లేనంత భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలపై అత్యంత ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన మావోయిస్టులు... ఎన్నికల్లో ప్రజలు పాల్గొనవద్దని పిలుపు ఇవ్వడంతో... ఈ విషయాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ ఉన్నతాధికారులూ... ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు ఎలాంటి సందేహాలూ పెట్టుకోకుండా ధైర్యంగా వచ్చి ఓటు వెయ్యాలని కోరుతున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడం ద్వారా మావోయిస్టులకు తగిన బుద్ధి చెప్పాలని అంటున్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా ఈసారి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

Telangana Elections 2018 | Polling Day | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 32, 815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 4 వేల సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించారు. వీటిలో 1,500 ప్రాంతాల్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్ర బలగాల్ని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్ట్రైకింగ్ ఫోర్స్... అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో హైపర్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎన్నికల విధుల్లో పాల్గొంటోంది. Telangana Elections 2018 | Assembly Elections Special Arrangements for Sensitive Constituencies in Telangana telangana elections, telangana elections 2018, telangana news, telangana, telangana assembly elections, telangana assembly elections 2018, telangana politics, telangana congress, తెలంగాణ ఎన్నికలు సమస్యాత్మక ప్రాంతాలు, తెలంగాణ ఎన్నికల్లో సర్వే ఫలితాలు,
తెలంగాణ ఎన్నికలకు ప్రత్యేక భద్రత


సవాల్ విసిరిన మావోయిస్టులకు చెక్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిపెట్టిన పోలీసు శాఖ... కేంద్ర బలగాలలో సగం వాటిని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మొహరించింది. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు బ్యానర్లు, పోస్టుర్లు పెట్టడంతో అక్కడ అదనపు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ ఆయుధాలు, సెన్సార్ పరికరాలతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు... ప్రతీ ప్రదేశాన్నీ జల్లెడ పడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పూర్తిస్థాయిలో సెక్యూరిటీ కల్పిస్తున్నాయి. సిర్పూరు, చెన్నూరు బెల్లంపలి, మంథని, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో ప్రతేక దృష్టి సారించారు.Telangana Elections 2018 | Polling Day | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 32, 815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 4 వేల సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించారు. వీటిలో 1,500 ప్రాంతాల్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్ర బలగాల్ని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్ట్రైకింగ్ ఫోర్స్... అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో హైపర్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎన్నికల విధుల్లో పాల్గొంటోంది. Telangana Elections 2018 | Assembly Elections Special Arrangements for Sensitive Constituencies in Telangana telangana elections, telangana elections 2018, telangana news, telangana, telangana assembly elections, telangana assembly elections 2018, telangana politics, telangana congress, తెలంగాణ ఎన్నికలు సమస్యాత్మక ప్రాంతాలు, తెలంగాణ ఎన్నికల్లో సర్వే ఫలితాలు,
తెలంగాణ ఎన్నికలకు ప్రత్యేక భద్రత


సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా :
Loading....
సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాలతోపాటూ మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గరా 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తినా ఎదుర్కొనేలా వ్యూహరచన చేశారు పోలీస్ అధికారులు.

సాయంత్రం 4 వరకే పోలింగ్ :
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై... సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. అందువల్ల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు త్వరగా వచ్చి ఓటు వేయాల్సిందిగా అధికారులు కోరారు. సాయంత్రం 4 గంటలకు కచ్చితంగా పోలింగ్ కేంద్రాల్ని మూసివేస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం నుంచీ క్యూలైన్లు పెరిగే అవకాశం ఉండటంతో, ఉదయాన్నే వచ్చి ఓటు వేయడం అత్యంత అనుకూలమైన సమయం అని అభిప్రాయపడుతున్నారు.
First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు