తెలంగాణ ఎన్నికల్లో గెలిచేదెవరు? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు?

Telangana Elections 2018: తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండగా... టెన్షన్ పెరిగిపోతున్న అభ్యర్థులు... జ్యోతిష శాస్త్ర పండితులను ఆశ్రయిస్తున్నారు. ఎవరు గెలుస్తారు? ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరి గ్రహబలం ఎలా ఉంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: December 10, 2018, 3:13 PM IST
తెలంగాణ ఎన్నికల్లో గెలిచేదెవరు? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు?
తెలంగాణలో అధికారం ఎవరిది?
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిందే శుక్రవారం వేళ అమావాస్య రోజున. శుక్రవారం లక్ష్మీదేవి కరుణిస్తుందని కొందరు నేతలు అంటే, అమావాస్య అపశకునం అని కొందరు నిట్టూర్చారు. ఢిల్లీ స్థాయిలో పేరున్న కొందరు నేతలైతే... పోలింగ్ తేదీని మార్పించేందుకు కూడా పావులు కదిపినట్లు తెలిసింది. ఐతే, ఇలాంటి నమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వని ఈసీ, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిపించేసింది. ప్రజలు కూడా చక్కగా స్పందించారు. అమావాస్య రోజు ఇళ్లలోంచీ బయటకు వెళ్లకూడదనే సెంటిమెంట్‌ను పక్కన పెట్టి మరీ ఓటు వేశారు. ఇదివరకటి కంటే మూడుశాతం ఎక్కువ పోలింగ్ జరగడాన్ని బట్టీ చూస్తే, ప్రజల్లో ఓటు వేయాలనే ఆలోచన బలంగా ఉన్నట్లు అర్థమైంది. మరో 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయిగానీ... అవి కూడా పడివుంటే, పోలింగ్ శాతం మరింత పెరిగేదే.

telangana election result, telangana election counting, telangana elections 2018, telangana news, telangana assembly elections 2018, telangana hung assembly, telangana election polls, telangana elections 2018 live, తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తెలంగాణ ప్రజాకూటమి గెలుపు, Telangana Elections 2018: తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండగా... టెన్షన్ పెరిగిపోతున్న అభ్యర్థులు... జ్యోతిష శాస్త్ర పండితులను ఆశ్రయిస్తున్నారు. ఎవరు గెలుస్తారు? ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరి గ్రహబలం ఎలా ఉంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటున్నారు, Telangana Elections 2018: According to astrology predictions, Who will win Telangana Elections?
కేసీఆర్‌తో హరీశ్‌రావు (file)

కేసీఆర్ గ్రహబలం ఎలా ఉంది?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంట్లు ఎక్కువే. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా తప్పనిసరిగా ముహూర్తం చూసుకుంటారు. ఎన్నికల నామినేషన్ వేసేటప్పుడు కూడా ఆయన... సిద్ధిపేట జిల్లాలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించారు. తాజాగా ఎన్నికల ఫలితాలపై రకరకాల వాదనలు వినిపిస్తుండటంతో... కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తారా? ఆయన గ్రహబలం ఎలా ఉంది అన్నదానిపై పార్టీ నేతలు పండితులను కలిసి తెలుసుకుంటున్నారు.మళ్లీ అధికారంలోకి కేసీఆర్?
కేసీఆర్ జాతకం, గ్రహబలం, గోచార బలం ప్రకారం టీఆర్ఎస్ మళ్లీ విజయం సాధిస్తుందని పండితులు చెబుతున్నారు. ఐతే, టీఆర్ఎస్‌కి 60 నుంచీ 70 సీట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఇప్పటికే టీఆర్ఎస్‌కి తమ పూర్తి మద్దతు ఉంటుందని మజ్లిస్ పార్టీ ప్రకటించడం వల్ల... ప్రభుత్వ ఏర్పాటు కేసీఆర్‌కి నల్లేరుపై నడకే అవుతుంది. కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత కొన్ని నెలలపాటూ రాష్ట్రంలో రాజకీయంగా, అభివృద్ధి పరంగా వేగవంతమైన మార్పులు ఉంటాయంటున్న పండితులు, ఆ తర్వాత పరిస్థితులు చక్కబడతాయని చెబుతున్నారు.

telangana election result, telangana election counting, telangana elections 2018, telangana news, telangana assembly elections 2018, telangana hung assembly, telangana election polls, telangana elections 2018 live, తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తెలంగాణ ప్రజాకూటమి గెలుపు, Telangana Elections 2018: తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండగా... టెన్షన్ పెరిగిపోతున్న అభ్యర్థులు... జ్యోతిష శాస్త్ర పండితులను ఆశ్రయిస్తున్నారు. ఎవరు గెలుస్తారు? ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరి గ్రహబలం ఎలా ఉంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటున్నారు, Telangana Elections 2018: According to astrology predictions, Who will win Telangana Elections?
సోనియాగాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి file
ప్రజాకూటమికి కూడా అనుకూలమేనా?
కేసీఆర్ తరహాలోనే కాంగ్రెస్ నేతలు కూడా ఈసారి ముహూర్తాలు, జాతకాల్ని చూసే నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా టికెట్ల కేటాయింపు, నామినేషన్ల ప్రక్రియ అన్నీ శుభ ఘడియలు చూసుకొనే చేశారు. ఎన్నికలు జరిగింది అమావాస్య కావడం ప్రజాకూటమి పార్టీల నేతల్ని ఒకింత కలవరపరుస్తోంది. ఐతే, మాజీ ఎంపీ లగడపాటి పోలింగ్ శాతం పెరిగితే, ప్రజాకూటమికి కలిసొస్తుందని చెప్పడం, నిజంగానే పోలింగ్ శాతం పెరగడంతో గెలుపు తమదే అన్న ధీమాతో ఉంటున్నారు హస్తం నేతలు.

ప్రస్తుతం కేసీఆర్‌తో పోల్చితే టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డికి గ్రహబలం కాస్త తక్కువగానే ఉంది. టీడీపీ నుంచీ కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి మాత్రం గ్రహబలం సంపూర్ణంగా ఉంది. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడమే కష్టమైపోయిన పొన్నాల లక్ష్మయ్యకు తారాబలం చాలా ఎక్కువగా ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణకు కూడా తారాబలం నిండుగా ఉంది. వీళ్లకు తోడుగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టడం వల్ల ప్రజాకూటమి అధికారంలోకి రావడానికి సానుకూల పరిణామాలు ఉన్నాయంటున్నారు.

telangana election result, telangana election counting, telangana elections 2018, telangana news, telangana assembly elections 2018, telangana hung assembly, telangana election polls, telangana elections 2018 live, తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తెలంగాణ ప్రజాకూటమి గెలుపు, Telangana Elections 2018: తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండగా... టెన్షన్ పెరిగిపోతున్న అభ్యర్థులు... జ్యోతిష శాస్త్ర పండితులను ఆశ్రయిస్తున్నారు. ఎవరు గెలుస్తారు? ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరి గ్రహబలం ఎలా ఉంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటున్నారు, Telangana Elections 2018: According to astrology predictions, Who will win Telangana Elections?
ఉత్తమ్, కేసీఆర్ file

సంఖ్యాశాస్త్రం ఏం చెప్పింది?
సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్పిన మరో ఆసక్తికర అంశం జంపింగ్స్. తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఈ నెల 11 తర్వాత మిగతా పార్టీల నుంచీ... అధికార పార్టీల్లోకి జంపింగ్‌లు పెరుగుతాయట. పాలక పక్షం మరో ఐదేళ్ల పాటూ అధికారంలోనే ఉంటుంది కాబట్టి... అందులోకి జంప్ అయిపోవడం సరైన నిర్ణయమని వివిధ పార్టీల నేతలు ఫిరాయింపులకు దిగుతారని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో కాంగ్రెస్, టీడీపీ నుంచీ చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి దూకేశారు. వాళ్లలో కొంతమంది మంత్రి పదవులు పదవులు దక్కించుకున్నారు. తాజాగా వాళ్లు టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు కూడా. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని టీడీపీ, కాంగ్రెస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలూ తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, తిరిగి ఫిరాయింపులు పెరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది.
First published: December 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు