LIVE NOW

Telangana Updates: 16 ఎంపీ స్థానాలే టార్గెట్: కేసీఆర్ దిశానిర్దేశం

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న భేటీకి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యనేతలు హాజరయ్యారు.

Telugu.news18.com | December 17, 2018, 12:40 PM IST
facebook Twitter Linkedin
Last Updated December 17, 2018
auto-refresh
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న సమావేశానికి పార్టీ నేతలు హాజరయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల విశ్లేషణతో పాటు, త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల మీద చర్చించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్న కేసీఆర్ దానికి సంబంధించి తన కార్యాచరణను కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జిని నియమించాలని సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు సాధించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారికి నామినేటెడ్ పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియమితులయ్యారు. ఆయన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు కేసీఆర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రధానంగా జాతీయ రాజకీయాల మీద దృష్టిపెట్టనున్నారు. అందుకోసం రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంది. దీంతో పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. తన తర్వాత కేటీఆర్ నెంబర్ 2 అనే సిగ్నల్‌ను కేడర్‌కు పంపారు.
Read More
Load Moreవచ్చే పార్లమెంట్ ఎన్నికలు, జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. దీంతో కేటీఆర్‌కు పార్టీలో నెంబర్ 2 బాధ్యతలు అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తర్వాత కేటీఆర్.. పార్టీ సెక్రటరీ జనరల్ కేకే, పార్టీ పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉన్న హరీశ్ రావును కలిశారు.
corona virus btn
corona virus btn
Loading