తెలంగాణలో ముగిసిన పోలింగ్.. ఈనెల 11న ఫలితాలు

Telangana assembly elections2018|తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 119 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ.. చెదురుమొదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.

news18-telugu
Updated: December 7, 2018, 5:20 PM IST
తెలంగాణలో ముగిసిన పోలింగ్.. ఈనెల 11న ఫలితాలు
లోక్‌‌సభ ఎన్నికల్లో కేవలం ఇంక్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం రూ.33 కోట్లు ఖర్చు చేయనుంది.
  • Share this:
తెలంగాణ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ముగిసింది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించబడిన 13 నియోజకవర్గాల్లో.. సాయంత్రం నాలుగింటికే పోలింగ్ ప్రక్రియ ముగియగా మిగితా 116 నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది. చెదురమొదురు ఘటనలు మినహా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5గంటలకు కొనసాగింది.

మధ్యాహ్నం మూడింటి వరకు 56 శాతం నమోదైన ఓటింగ్ శాతం.. ఐదుగంటల వరకు దాదాపు 70 శాతాన్ని తాకింది. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించబడిన 13 నియోజకవర్గాల్లోనూ 70 శాతం ఓటింగ్ నమోదుకావడం విశేషం. ఇక, సాయంత్రం ఐదింటి లోపల పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి అధికారులు ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు.

First published: December 7, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading