మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నాగిరెడ్డి

రేపటి ఎన్నికల కోసం 55 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని నాగిరెడ్డి స్పష్టం చేశారు.

news18-telugu
Updated: January 21, 2020, 5:03 PM IST
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నాగిరెడ్డి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి వివరించారు. 83 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ధన ప్రభావాన్ని కట్టడి చేసేందుకు నిఘా కొనసాగుతోందని వివరించారు. దొంగ ఓట్లను సహించేది లేదన్నారు. ఇప్పటి వరకు రూ.16లక్షలు విలువైన మద్యం, రూ.44 లక్షలు సీజ్‌ చేశామని నాగిరెడ్డి తెలిపారు. పెద్దపల్లిలో ప్రలోభాలకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రలోభాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉంటే ఈసీకి అందించాలన్నారు. అభ్యర్థుల చరిత్ర, అఫిడవిట్‌లు వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు. రేపటి ఎన్నికల కోసం 55 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని నాగిరెడ్డి స్పష్టం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: January 21, 2020, 5:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading