నీకు లక్ష మెజార్టీ గ్యారెంటీ బావ: హరీష్‌రావుతో కేటీఆర్

నీకు లక్ష మెజార్టీ ఖాయం బావ అంటూ హరీష్‌రావుతో అన్నారు మంత్రి కేటీఆర్. నీ దాంట్లో నేను సగమన్నా తెచ్చుకుంట, సిరిసిల్ల పోతున్న అని ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన పోలింగ్ జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: December 7, 2018, 3:13 PM IST
నీకు లక్ష మెజార్టీ గ్యారెంటీ బావ: హరీష్‌రావుతో కేటీఆర్
నీకు లక్ష మెజార్టీ గ్యారెంటీ బావ: హరీష్‌రావుతో కేటీఆర్ (ఫైల్ ఫొటో)
  • Share this:
హరీష్‌రావు, కేటీఆర్ మధ్య సరదా సన్నివేశం టీఆర్ఎస్ శ్రేణులకు కనువిందు చేసింది. హైదరాబాద్‌ నుంచి కేటీఆర్ సిరిసిల్ల వెళ్తుండా... అదే సమయంలో మంత్రి హరీష్ రావు సిద్ధిపేట నియోజకవర్గంలో పోలింగ్ సరళి తెలుసుకొని తిరిగి వస్తున్నారు. గుర్రాల గొంది గ్రామం దగ్గర ఇద్దరు మంత్రులూ ఎదురుపడ్డారు. ఒకర్నొకరు చూసుకొని కారు దిగారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. నీకు లక్ష మెజార్టీ ఖాయం బావ అంటూ హరీష్‌రావుతో అన్నారు మంత్రి కేటీఆర్. నీ దాంట్లో నేను సగమన్నా తెచ్చుకుంట, సిరిసిల్ల పోతున్న అని ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన పోలింగ్ జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు.

హరీశ్ రావు కేటీఆర్ వీడియో ఇక్కడ చూడండి

First published: December 7, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading