Telangana Exit Polls: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే...

ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ చూస్తే ఓటర్లు మళ్లీ టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపినట్టే అర్థమవుతోంది. మహాకూటమి పాత్ర ప్రతిపక్షానికే పరిమితం కానుంది.

news18-telugu
Updated: December 7, 2018, 7:49 PM IST
Telangana Exit Polls: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే...
న్యూస్ 18 క్రియేటివ్
news18-telugu
Updated: December 7, 2018, 7:49 PM IST
పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఫలితాలే. అయితే అంతకన్నా ముందే ఎగ్జిట్ పోల్ సర్వేల హడావుడి మొదలైంది. మొన్నటి వరకు ప్రీపోల్ సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపితే... ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ జనంలో చర్చనీయాంశమవుతున్నాయి. వివిధ మీడియా సంస్థలు పోలింగ్ రోజున ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వాటి ఫలితాలను విడుదల చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ చూస్తే Times Now-CNX,  India today, Axis, Republic TV- Jan Ki Bat టీఆర్ఎస్‌దే విజయం ఖాయమని చెప్పాయి. newsx, C-Voter, News Nation మాత్రం హంగ్ అసెంబ్లీ తప్పదన్నట్టు ఫలితాలను వెల్లడించాయి. ఇక ఆక్టోపస్‌గా పేరు పొందిన లగడపాటి మాత్రం మహాకూటమిదే విజయమని చెప్పడం సంచలనంగా మారింది. అసలు ఫలితాలేంటో తెలుసుకోవాలంటే డిసెంబర్ 11 వరకు ఆగాల్సిందే. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.






























































సర్వే సంస్థ టీఆర్ఎస్  మహాకూటమి  బీజేపీ ఇతరులు
Lagadapati 25 - 45 55- 75 5 - 7 11-16
 Times Now-CNX  66  37  7  9
 India today, Axis  79-91  21-33  1-3  4-7
 Republic TV- Jan Ki Bat  50-65  38-52  4-7  10-12
 newsx  57  46  6  10
C-Voter 54 53 5 7
News Nation 55 53 3 8

 

ఇవి కూడా చదవండి:

ఛత్తీస్‌గఢ్‌ ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ

మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ : కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్
First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...