తెలంగాణ ఎన్నికలు 2018 : జర్నలిస్టుల లెక్కేంటి? రెండుగా విడిపోయారా?

Telangana Election 2018: జర్నలిస్టులు కూడా మనలాంటి వాళ్లే కదా. వాళ్లలోనూ చాలా మందికి రాజకీయ పార్టీలపై సదభిప్రాయాలు, వ్యతిరేకతలూ ఉంటాయి. ఐతే వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, పక్షపాత వైఖరి లేకుండా వార్తలు ఇస్తుంటారు. మరి తెలంగాణ ఎన్నికల విషయంలో ఏం జరుగుతోంది? జర్నలిస్టులు కూడా పార్టీల పరం అయిపోయారా? నీతి సూత్రాలు వదిలేసి... పార్టీలను టార్గెట్ చేస్తున్నారా?

Krishna Kumar N | news18-telugu
Updated: December 5, 2018, 5:24 PM IST
తెలంగాణ ఎన్నికలు 2018 : జర్నలిస్టుల లెక్కేంటి? రెండుగా విడిపోయారా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బిందువైన హైదరాబాద్‌లో గత వారం "జరలిస్ట్స్ ఫోరం ట సేవ్ తెలంగాణ" అధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. నాలుగున్నరేళ్లుగా సీఎం కేసీఆర్... తమను అవమానకరంగా, హీనంగా చూశారని జర్నలిస్టులు ఫైర్ అయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన జర్నలిస్టు సంఘాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చతికిలపడిపోయాయని ఆవేదన చెందారు. ప్రశ్నించడమే నేరంగా భావిస్తున్న సర్కారు వల్ల ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని అభిప్రాయపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల వంటి జర్నలిస్టులకు ఇచ్చిన ఎన్నో హామీలను గాలికొదిలేశారనీ... కేవలం ఆరోగ్యశ్రీ కార్డులు, అక్రెడిటేషన్లు జారీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని వాళ్లు మండిపడ్డారు.

సోషల్ మీడియాలో వార్ :

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లే... జర్నలిస్టులలోనూ కొందరికి టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తి ఉందన్నది కఠిన సత్యం. ఐతే... తెలంగాణ ఎన్నికల సమయంలో... సోషల్ మీడియా సాక్షిగా... జర్నలిస్టుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే జర్నలిస్టులు రెండుగా విడిపోయారు. ఎవరికి వాళ్లు సొంత సర్వేలు చేయించుకొని... వాటిని వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. కొందరు తమకు నచ్చిన పార్టీలకు అనుకూలంగా, నచ్చని పార్టీలకు వ్యతిరేకంగా వస్తున్న సర్వేలను ఇంటర్నెట్‌లో వెతికి మరీ పోస్ట్ చేస్తున్నారు. ఈ సర్వేల్లో కొన్ని టీఆర్ఎస్‌కి అనుకూలంగా ఉంటే... మరికొన్ని ప్రజాకూటమిదే విజయం అంటున్నాయి. కేవలం పోస్టులతో సరిపెడితే పర్వాలేదు. కానీ కొంతమంది జర్నలిస్టులు కూడా రాజకీయ నాయకులలాగా సెటైర్లు, కౌంటర్లు వేస్తున్నారు. ఇంకొందరైతే తిట్లపురాణం అందుకుంటున్నారు. తమకు నచ్చిన పార్టీని మెచ్చుకుంటూ, నచ్చని పార్టీని ఉతికారేస్తున్నారు. పోస్టుల పేరుతో జరుగుతున్న ఇలాంటి గొడవలు హద్దులు మీరుతున్నాయి. ఇవి గ్రూప్ అడ్మిన్లకు తలనొప్పిగా మారుతున్నాయి.

ఆయా టీవీ ఛానెళ్లు, పత్రికల్లో పనిచేస్తున్న రిపోర్టర్లు, విలేకరులు... తమ వ్యక్తిగత అభిప్రాయాల్ని చెప్పుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. రెండు నెలల నుంచీ ఈ సోషల్ వార్ సాగుతోంది. మొదట్లో టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేందుకు సందేహించిన వాళ్లు... ఇప్పుడు పోస్టులే కాదు... వీడియోలు, బహిరంగ ప్రకటనలు కూడా చేస్తున్నారు. పక్షపాత రహితంగా వ్యవహరించాల్సిన వాళ్లు... ఇలా కంట్రోల్ తప్పుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జర్నలిస్టులు తమ సొంత అభిప్రాయాలకు విలువిస్తే... వాస్తవ పరిస్థితులు వెలుగులోకి రావన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదుల నుంచీ వినిపిస్తోంది.


రాజకీయాల్లో జర్నలిస్టులు :
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించామని భావిస్తున్న కొందరు జర్నలిస్టులు టీఆర్ఎస్ నుంచీ టికెట్లు ఆశించారు. వారిలో కొందరికి కేసీఆర్ నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. కేసీఆర్ ఆదరణ పొందిన జర్నలిస్ట్ క్రాంతి కిరణ్‌కి ఈసారి ఎన్నికల్లో ఆందోల్ టికెట్ దక్కింది. ఐతే... క్రాంతి కిరణ్ లాగే... తెలంగాణ ఉద్యమ కాలంలో... ఓ ప్రముఖ దినపత్రికలో పనిచేస్తూ... టీఆర్ఎస్ వ్యవహారాలు చూసే మరో జర్నలిస్ట్ పల్లె రవి కూడా పార్టీ టికెట్ ఆశించారు. ఆయనకు మునుగోడు అసెంబ్లీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్... అది నిలబెట్టుకోకపోవడం వల్లే... కేసీఆర్‌కి వ్యతిరేకంగా పల్లె రవి వార్తలు రాయడం మొదలుపెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉద్యోగం వదిలేసిన రవి... కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా జర్నలిస్టులు కూడా రాజకీయాల్లో పావులు కదుపుతుండటంతో... ఈసారి తెలంగాణ ఎన్నికల అంశాలు... సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్నాయి.

Telangana Election 2018: In Telangana Journalists stands divided, involves in Social Media War జర్నలిస్టులు కూడా మనలాంటి వాళ్లే కదా. వాళ్లలోనూ చాలా మందికి రాజకీయ పార్టీలపై సదభిప్రాయాలు, వ్యతిరేకతలూ ఉంటాయి. ఐతే వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, పక్షపాత వైఖరి లేకుండా వార్తలు ఇస్తుంటారు. మరి తెలంగాణ ఎన్నికల విషయంలో ఏం జరుగుతోంది? జర్నలిస్టులు కూడా పార్టీల పరం అయిపోయారా? నీతి సూత్రాలు వదిలేసి... పార్టీలను టార్గెట్ చేస్తున్నారా? telangana elections 2018, telangana elections, telangana news, telangana election 2018, telangana, telangana election suvey, telangana election 2018 latest survey, telangana Journalists on Trs Government, తెలంగాణ ఎన్నికల్లో సర్వేలు ఫలితాలు జర్నలిస్టుల అభిప్రాయాలు, తెలంగాణ ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ సర్వే elections, assembly, elections, telangana, elections, electionlist,
ప్రతీకాత్మక చిత్రం
జర్నలిస్టుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతోంది. జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప... ఇంకే ప్రభుత్వమైనా కేటాయించిందా అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఆంధ్రా పాలకులు విలేకరులను నిర్లక్ష్యం చెయ్యగా... కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... 16వేల అక్రెడిటేషన్లు ఇచ్చామని చెబుతున్నారు. ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున.... ఆలస్యం అవుతుందే తప్ప... తమ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు కాదని వాళ్లు సమర్థించుకుంటున్నారు.

కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడిపోయిన దేశం మనది. వీటిని అడ్డం పెట్టుకునే ఇప్పటికీ రాజకీయ నాయకులు పదవులు కొల్లగొడుతున్నారు. విద్యావంతులు, మేధావులైన జర్నలిస్టులు... అందరిలా కాకుండా... ఆచితూచి స్పందించాలంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. జర్నలిస్టులుగా తమకంటూ ఓ అభిప్రాయం ఉడటం మంచిదే... అందులో తమకు కలిగే వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే పరమావధి కావాలని కోరుతున్నారు.


Video: జాతీయ స్థాయిలో పనిచేయాల్సి సమయం వచ్చింది: చంద్రబాబు


Published by: Krishna Kumar N
First published: December 5, 2018, 4:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading