ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ మంత్రి ఈటల లేఖ...టీటీడీ బోర్డులో..

జగన్‌తో కేసీఆర్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆ పదవుల కోసం టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

news18-telugu
Updated: June 15, 2019, 4:36 PM IST
ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ మంత్రి ఈటల లేఖ...టీటీడీ బోర్డులో..
జగన్, ఈటల రాజేందర్
news18-telugu
Updated: June 15, 2019, 4:36 PM IST
టీటీడీ బోర్డులో చోటు కోసం తెలుగు రాష్ట్రాల్లో పోటీ తీవ్రమైంది. ఏపీయే కాదు తెలంగాణ నుంచి కూడా కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జగన్, కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం టీఆర్ఎస్ నేతలు తెరవెనక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రుల ద్వారా సిఫారసు చేయిస్తున్నారు.ఈ క్రమంలో శనివారం తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో హుజూరాబాద్‌కు చెందిన దొంత రమేష్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించాలని ఈటల కోరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీవారికి భక్తులకు 18 ఏళ్లుగా రమేష్ తిరుమలలో సేవ చేస్తున్నారని ఈటల పేర్కొన్నారు. టీటీడీ బోర్డు అభివృద్ధితోపాటు భక్తులకు సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని వివరించారు.

ఏపీలో దేవాలయాలు, పాలక మండళ్లను రద్దు చేయాలని ఏపీ కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే ఆర్డినెన్స్ తెచ్చేందుకు పావులు కదుపుతోంది. అనంతరం టీటీడీ బోర్డును ప్రక్షాళన సీఎం జగన్ ప్రక్షాళన చేస్తారని..టీటీడీ బోర్డు కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తారని సమాచారం. ఇప్పటికే టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. బోర్డు చైర్మన్ నియామకం తర్వాత సభ్యుల నియామకం ఉంటుంది.

టీటీడీ బోర్డులో గతంలో తెలంగాణకు చెందిన కొందరు టీడీపీ నేతలకు కూడా చోటు కల్పించారు చంద్రబాబు. ఐతే తెలంగాణలో వైసీపీ ఉనికి లేదు. కనీసం కార్యవర్గం కూడా లేదు. ఈ నేపథ్యంలో జగన్‌తో కేసీఆర్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆ పదవుల కోసం టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరి టీటీడీ కొత్త బోర్డులో తెలంగాణ వారికి జగన్ ప్రాతినిధ్యం కల్పిస్తారో లేదో చూడాలి.

First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...