• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA DY CM MAHMOOD ALI AGAIN BECOME HOT TOPIC IN POLITICAL CIRCLES BA

మరోసారి హాట్ టాపిక్‌గా మారిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ...

మరోసారి హాట్ టాపిక్‌గా మారిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ...

హోంమంత్రి మహమూద్ అలీ(ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌కు ముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌తో కలసి మీడియా సమావేశ మందిరానికి వచ్చారు మహమూద్ అలీ.

  • Share this:
    తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన కేబినెట్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సుమారు మూడున్నర గంటల కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే, ప్రెస్ మీట్‌కు ముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌తో కలసి మీడియా సమావేశ మందిరానికి వచ్చారు మహమూద్ అలీ. కొంతసేపు అక్కడే ఉన్నారు. అయితే, సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్‌కు రాకముందే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా, హోంశాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న మహమూద్ అలీ కూడా ప్రెస్ మీట్‌లో ఉంటారని అంతా భావించారు. కానీ, సడన్‌గా వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

    కొన్ని రోజుల క్రితం ఏప్రిల్ 1వ తేదీన కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై బుధవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే మహమూద్‌ అలీ ప్రగతి భవన్‌కు వచ్చారు. అయితే ప్రగతిభవన్‌ ప్రవేశ ద్వారం వద్దే ఆయనను భద్రతా సిబ్బంది నిలిపేశారు. కొంతసేపు అక్కడే వేచిచూసిన మహమూద్‌ అలీ తిరిగి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్‌ ముఖ్యమైన సమీక్ష నిర్వహిస్తున్నందున లోపలికి ఎవరినీ అనుమతించరాదని ఆదేశాలున్నాయని, హోంమంత్రి వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందేలోగా ఆయన వెళ్లిపోయారని తెలుస్తోంది.

    అయితే, సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసేందుకు వెళ్లడం వల్ల, అదే సమయంలో తనకు అత్యవసరంగా పని ఏర్పడడంతో వెనుదిరిగి వెళ్లిపోయినట్టు చెప్పారు. తనను ప్రగతిభవన్‌లోకి అనుమతించలేదన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: