సీట్ల సర్దుబాటే కూటమి కొంపముంచింది: చాడ వెంకట్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి ఘోర పరాభవం ఎదురైంది. భాగస్వామ్య పార్టీలకు చెందిన కీలక నేతలందరూ టీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. దీనిపై భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి.

news18-telugu
Updated: December 29, 2018, 7:31 PM IST
సీట్ల సర్దుబాటే కూటమి కొంపముంచింది: చాడ వెంకట్‌రెడ్డి
Video : టిఆర్ఎస్ కు ఇచ్చే మద్దతుపై పునరాలోచిస్తాం : చాడ వెంకట్ రెడ్డి
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ మహాకూటమి కట్టాయి. సీపీఐ, టీజేఎస్, టీడీపీలతో జతకట్టిన కాంగ్రెస్‌.. అధికార టీఆర్ఎస్ పార్టీతో హోరాహోరీగా తలపడినప్పటికీ ఫలితం లేకపోయింది. టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక.. కూటమిలోని కాంగ్రెస్ సహా భాగస్వామ్య పార్టీల కీలక నేతలు ఓటమి చవిచూశారు. దీంతో మహాకూటమికి మొత్తంగా 21 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, కూటమి మిత్రపక్షాలు ఎలాంటి వ్యతిరేక ప్రకటనా చేయలేదు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి.. కూటమి ఓటమిపై స్పందించారు.
కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో మీడియాతో మాట్లాడిన చాడ వెంకట్ రెడ్డి.. సీట్ల సర్దుబాటే కూటమి కొంప ముంచిందని అభిప్రాయపడ్డారు. సీట్ల పంపకాల్లో జాప్యం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. కూటమి ఎజెండాను తెలంగాణ రాష్ట్ర సమితి హైజాక్ చేసిందని.. వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఊహకు అందని రీతిలో వచ్చాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే... 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిందని, బీజేపీకి చుక్కెదురైందని గుర్తు చేశారు.
ఇక, తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టిన కేసీఆర్.. సామాజిక న్యాయం చేయకుండా సమాజద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 17 రోజులైనా మంత్రిమండలిని ఏర్పాటు చేయని చరిత్ర కేసీఆర్‌దేనని విమర్శించారు. గతంలో 34శాతం ఉ్న గ్రామపంచాయతీల రిజర్వేషన్లను 23 శాతానికి కుదించి.. బీసీలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. కృష్ణాజలాల వాడకంలో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరకుండా అఖిల పక్షంతో వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
First published: December 29, 2018, 7:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading