హోమ్ /వార్తలు /National రాజకీయం /

Revanth Reddy: కాంగ్రెస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

Revanth Reddy: కాంగ్రెస్ ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

వీటితో పాటు హుజురాబాద్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వంటి అంశాలను లేఖలో పొందుపరిచారు. రేవంత్ రెడ్డి తీరు వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆరోపించారు.

వీటితో పాటు హుజురాబాద్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వంటి అంశాలను లేఖలో పొందుపరిచారు. రేవంత్ రెడ్డి తీరు వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆరోపించారు.

Revanth Reddy: కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తుండగా.. మరికొందరు నేతలు మాత్రం రేవంత్ రెడ్డికి దూరం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి రేవంత్ రెడ్డి అండ్ టీమ్‌కు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణ కాంగ్రెస్‌ను తనదైన స్టయిల్లో ముందుకు తీసుకెళుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత గిరిజన, దళిత దండోరా సభలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి.. కొందరు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినా.. ముందుకు సాగుతున్నారు. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుని అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో సభను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ టీమ్. ఓ వైపు ఈ తరహా కార్యక్రమాలతో రేవంత్ రెడ్డి ముందుకు సాగుతుంటే.. ఆయనకు సీనియర్ల నుంచి సహకారం లభించడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సభలకు ఇప్పటివరకు హాజరుకాలేదు. మరికొందరు నేతలు కూడా ఈ సభలకు దూరంగా ఉంటున్నారు.

  కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తుండగా.. మరికొందరు నేతలు మాత్రం రేవంత్ రెడ్డికి దూరం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి రేవంత్ రెడ్డి అండ్ టీమ్‌కు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న జానారెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి జరుగుతున్న కృషి అభినందనీయమని అన్నారు.

  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుందన్నారు.. అందరూ ఐక్యమత్యంతో కలిసి పనిచేసి… తెలంగాణకు కాంగ్రెస్ మాత్రమే దిక్సూచి అని నిరూపించాలని సూచించారు. దీనికోసం నా వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు జానారెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీ బలోపేతం అవుతోందని అన్నట్టుగా ఉందని కొందరు చర్చించుకుంటున్నారు.

  Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటున్నారా ?.. ఇలా చేస్తే మీ నిద్రకు ఇబ్బంది ఉండదు..

  Revanth Reddy: రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే.. ఆ రిపోర్ట్ ఆధారంగా కీలక నిర్ణయాలు

  నల్లగొండకు చెందిన కాంగ్రెస్ సీనియర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వంటి వాళ్లు రేవంత్ రెడ్డికి దూరంగా ఉంటున్న సమయంలో.. జానారెడ్డి రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపినట్టు కనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి అండ్ టీమ్‌కు కలిసొచ్చే విషయమని.. జానారెడ్డి వంటి నాయకుడు అండగా ఉంటే.. మిగతా సీనియర్ నేతలను రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకునే అవకాశం లేదనే చర్చ కూడా సాగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Jana reddy, Komatireddy venkat reddy, Revanth Reddy, Telangana, Uttam Kumar Reddy

  ఉత్తమ కథలు