Home /News /politics /

TELANGANA CONGRESS SENIOR LEADER GUDUR NARAYANA REDDY SET TO JOIN BJP SU

Gudur Narayana Reddy: కాంగ్రెస్ మరో భారీ షాక్.. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన టీపీసీసీ కోశాధికారి గుడూరు నారాయణరెడ్డి

గుడూరు నారాయణరెడ్డి(ఫైల్ ఫొటో)

గుడూరు నారాయణరెడ్డి(ఫైల్ ఫొటో)

జీహెచ్‌ఎంసీ ఎన్నికల(GHMC Elections) వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకులేని షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ కోశాధికారి గుడూరు నారాయణరెడ్డి(Gudur Narayana Reddy) బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది.

ఇంకా చదవండి ...
    జీహెచ్‌ఎంసీ ఎన్నికల(GHMC Elections) వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకులేని షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌కు బలమైన నేతలుగా ఉన్నావారు కూడా పార్టీని వీడి.. బీజేపీలోకి చేరడం టీపీసీపీకి మింగుడు పడటం లేదు. ఈ పరిస్థితులు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆందోళనలోకి నెట్టివేసింది. ఈ క్రమంలో ఇతర పార్టీల్లోకి వెళ్లాలని భావిస్తున్న నేతలను బుజ్జగించేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇంకా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ కోశాధికారి గుడూరు నారాయణరెడ్డి(Gudur Narayana Reddy) బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. అయితే పార్టీలో చేరే తేదీకి సంబంధించి ఆయనతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.

    గుడూరు నారాయణరెడ్డి పార్టీ మారుతున్నారనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఆయన బుజ్జగించే పనిలో పడ్డారు. పార్టీని వీడకుండా ఉండేందుకు ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం మాత్రం కనిపించడం లేదు. బీజేపీలో చేరేందుకు నారాయణరెడ్డి అన్నిరకాలుగా సిద్ధపడినట్టుగా సమాచారం. ఇక, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ ‌రెడ్డికి నారాయణరెడ్డి మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఇక, నారాయణరెడ్డికి కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దలు సంబంధం ఉంది. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లలో ఆయన పనిచేశారు. అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(AICC) మెంబర్‌గా కూడా ఉన్నారు. అలాంటి నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది.

    Andhra Pradesh Weather: ఏపీని పొంచి ఉన్న తుపాన్ల గండం.. రేపే మరో తుపాన్?

    PM Modi Hyderabad Visit: నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ.. స్వాగతం పలికేందుకు ఆ ఐదుగురికి మాత్రమే అనుమతి

    ఇక,ఇప్పటికే మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యానారాయణ వంటి నేతలు కాంగ్రెస్‌ను వీడిన సంగతి తెలిసిందే. అదే బాటలో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ గుడ్‌ బై చెప్పి బీజేపీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే బాటలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, డిసెంబర్ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Bjp, Congress, Hyderabad - GHMC Elections 2020, Tpcc

    తదుపరి వార్తలు