Home /News /politics /

TELANGANA CONGRESS PRESIDENT REVANTH REDDY COMMENTS ON CHINAJEEYAR SWAMY KCR KTR AND BJP AK

చినజీయర్ కార్యక్రమం రియల్ ఎస్టేట్ కోసమేనా ?.. కేసీఆర్ మిత్రద్రోహం.. కేటీఆర్‌ మాట్లాడాలంటే సినీ గ్లామర్.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

సమానత్వం అని చెబుతున్న స్వామిజీ.. ఒక ఎంపీ, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఉన్న తనకు ఒక రియల్ ఎస్టేట్ ఉద్యోగి ద్వారా ఆహ్వానం పలుకుతారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

    చినజీయర్ స్వామి ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన రామానుజ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్వామీజీ అంతగొప్ప కార్యక్రమాన్ని ఒక రియలేస్టేట్ సంస్థ కోసం చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. దేవుని ముందు అందరూ సమానమే అన్న స్వామీజీ.. ఆచరణలో మాత్రం అలా చేయడం లేదని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన అడ్డం పెట్టుకుని జూపల్లి రామేశ్వర్ రావు ఆస్తులను పెంచడానికి వ్యవస్థను ప్రభుత్వం వాడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చిన్నజీయర్ స్వామి దగ్గర రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఉంటే.. ఆయన గౌరవానికి అది సరికాదని రేవంత్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చెట్లను నరకడంపై బీజేపీ కూడా సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చినజీయర్ స్వామిని కలిసి ఏమైనా చెప్పాలని అనుకుంటే.. ఆయన చుట్టూ అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉంటారని అన్నారు.

    తాము శైవులం కాబట్టి వైష్ణవులు తమను అవమానిస్తున్నారా ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సమానత్వం అని చెబుతున్న స్వామిజీ.. ఒక ఎంపీ, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఉన్న తనకు ఒక రియల్ ఎస్టేట్ ఉద్యోగి ద్వారా ఆహ్వానం పలుకుతారా? అని ప్రశ్నించారు. చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమం నుంచి మాకు ఆహ్వానం ఎందుకు రాలేదు ? అని వ్యాఖ్యానించారు. చిన్నజీయర్ స్వామీజీపై తమకు అపారమైన గౌరవం ఉందని.. అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను పక్కనపెట్టుకుని తిరిగితే తమకు అనుమానాలు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు.

    కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుందని.. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదని.. టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం ఎలా చదువును అందిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియామకాలు చేపట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. పాఠశాలలో కరోనా రావడం వల్ల మరణాలు లేవని.. అయినా వాటిని మూసివేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదాయం వస్తుంది కాబట్టే పార్టీలు, పబ్‌లను నియంత్రించడం లేదని విమర్శించారు.

    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.. పూర్తి వివరాలు

    ఆ సీట్లపై కన్నేసిన Telangana Bjp.. 2 నెలలు పాదయాత్ర.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

    బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ని చూస్తే.. ఆ పార్టీ పని ముగిసిపోయిందని అర్థమవుతోందని అన్నారు. బీజేపీ పక్క పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీలు వేసుకున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో టీఆర్ఎస్ ఎస్పీకి మద్దతుగా ప్రచారం చేస్తే.. అక్కడ పోటీ చేస్తున్న ఎంఐఎంకు మిత్రదోహం చేసినట్టే అని అన్నారు. తెలంగాణలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని యూపీలో ఎస్పీకి ప్రచారం చేస్తారా ? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ చర్చలు జరపాలంటే సినీ గ్లామర్ ఉండాలని.. అది తన దగ్గర లేదని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Revanth reddy, Telangana

    తదుపరి వార్తలు