Home /News /politics /

TELANGANA CONGRESS PARTY IS GOING TO TAKE COMPLAINS AGAINST DHARANI PORTAL WHO IS FACE ISSUES WHILE USING PRV

Dharani Portal: ధరణి బాధితులకు కాంగ్రెస్​ అండ.. వారం రోజుల పాటు ఫిర్యాదుల స్వీకరణ.. దాసోజు శ్రవణ్​ వెల్లడి

దాసోజు శ్రవణ్​ (ఫైల్​)

దాసోజు శ్రవణ్​ (ఫైల్​)

ధరణి పోర్టల్​లో చాలా సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దీనిపై కోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

    తెలంగాణ ప్రజల కోసం ఆస్తి నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో ధరణి పోర్టల్‌ (Dharani portal)ను ప్రారంభించింది. లాక్డౌన్ తరువాత COVID-19 మహమ్మారి ఆస్తి రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది, మొత్తం విధానాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆదాయాలు ప్రవహించేలా ఉంచడానికి. ఆస్తి రిజిస్ట్రేషన్ (Property Registration) కాకుండా, ల్యాండ్ మ్యుటేషన్, ల్యాండ్ రికార్డ్ సెర్చ్ మరియు ఇతర భూ-సంబంధిత సేవలకు ఒక స్టాప్ గమ్యస్థానంగా పోర్టల్ లక్ష్యంగా ఉంది. అయితే ధరణి పోర్టల్​లో చాలా సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దీనిపై కోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది యజమానులు రికార్డులు పట్టుకొని ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట తిరుగుతున్నారని కాంగ్రెస్ (Congress)​ ఆరోపిస్తోంది.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలపై టీపీసీసీ చీఫ్​ రేవంత్ నేతృత్వంలో చర్చించినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ (AICC spokesperson Dasoju Sravan) తెలిపారు.

    సర్వే చేసి రికార్డుల సవరణ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం అనాలోచితంగా ధరణి పోర్టలు తీసుకొచ్చిందని దాసోజు శ్రవణ్ (Dasoju Sravan)   అన్నారు.  ధరణి బాధితులకు మద్దతుగా వారం రోజుల పాటు భూ పరిరక్షణ ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు శ్రవణ్ తెలిపారు. మండల కేంద్రాల్లో భూ సమస్యలు ఎదుర్కొంటున్న ధరణి బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి (Take complains from them) రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు దాసోజు శ్రవణ్.

    ప్రభుత్వ ఖజానాను పెంచుకోవడానికి..

    ప్రభుత్వ ఖజానాను పెంచుకోవడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రుసుములను కూడా పెంచాలని చూస్తున్నారని విమర్శించారు. ధరణి బాధితులకు కాంగ్రెస్ పార్టీ (Congress party) అండగా ఉంటుందని అవసరమైతే ప్రధాని, రాష్ట్రపతిని కూడా కలుస్తామని శ్రవణ్​ అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను ధరణి పేరుతో లాక్కున్నారని కాంగ్రెస్ విమర్శించింది.

    భూసేకరణ జరిగిన తరువాత..

    ప్రాజెక్టుల కోసం లక్షల ఎకరాల భూమిని (land) లాక్కొని, భూముల విలువ ఆధారంగా లెక్కలు కట్టలేదని, ఫలితంగా భూమి కోల్పోయిన బాధితులు నష్టపోయారని శ్రవణ్ వివరించారు. భూసేకరణ జరిగిన తరువాత ధరలు పెంచుతున్నామని చెప్పి ప్రజల నోట్లో మన్ను కొట్టాలని తెరాస ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. గతంలో కాంగ్రెస్ 25 లక్షల ఎకరాలను పంచిపెట్టిందని, వాటిని అయినవాళ్లకు కట్టబెట్టే కుటు జరుగుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. రైతులను బెదిరించి ప్రభుత్వం దందా చేస్తోందని అన్నారు. సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ధరణి కమిటీ మరిన్ని అంశాలపై చర్చిస్తుందని  అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Dharani Portal, TS Congress

    తదుపరి వార్తలు