Home /News /politics /

TELANGANA CONGRESS PAC MEETING DISPUTES WILL BE DISCUSSED WITHIN THE PARTY VRY

Telangana Congress : కాంగ్రెస్ రచ్చకు .. సాయంత్రం ఫుల్‌స్టాప్ పడనుందా.. నేతలు ఏం చెప్పనున్నారు..?

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana Congress : గత వారం రోజులుగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన రచ్చపై నేటి సాయంత్రం జరగనున్న పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశం ఫుల్‌స్టాప్‌ పెట్టనుందా.. రేవంత్ రెడ్డి దూకుడుపై గుర్రుగా ఉన్నా నేతల యాక్షన్ ఎలా ఉండబోతుంది.

ఇంకా చదవండి ...
    రేవంత్ రెడ్డి ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమం ఆ పార్టీలో అంతర్గత రచ్చ బయటపడింది. దీంతో ఆ అంశాలపై చర్చించడంతో పాటు పార్టీని గాడిన పడేందుకు పార్టీ పార్టీ రాజకీయ వ్వవహారాల కమిటీ నేడు గాంధీ భవన్‌లో సమావేశం కానుంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలు పాల్గోని జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. అయితే ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారనే ఉత్కంఠ కూడా నెలకొంది.

    గత వారం రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం ఆ పార్టీలో మరోసారి చిచ్చురేపంది. మెదక్ జిల్లాల్లో కార్యక్రమానికి పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వక పోవడం వెనక అంతర్యం ఏమిటని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏకంగా పార్టీ హైకమాడ్‌కు లేఖ రాశారు..కాగా ఆ లేఖ బయటపడడంతో మరోసారి రచ్చ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే పార్టీ నేతల మధ్య కూడా అభద్రత భావం కూడా కనిపిస్తోంది. మరోవైపు పార్టీలో సమన్వయం లేకుండా పోవడంతో పాటు కొంతమంది పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్నారు. దీంతో ఈ అంశాలపై పోలిటికల్ ఎఫైర్ కమిటి సమావేశం కావాలని నిర్ణయించారు. పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన నేడు సాయంత్రం సమావేశం కానున్నారు. కాగా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా అటాక్ కావడంతో ఆయన ఫిజికల్‌గా సమావేశంలో పాల్గొనే అవకాశాలు లేవు.. అయితే ఆయన వర్చువల్‌గానే హజరయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Corona Third wave : థర్డ్‌వేవ్ వచ్చేస్తోందా...? రోజుకు లక్ష కరోనా కేసులు.. రెండు వారాల్లో ఇది ఖాయం..


    ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడిగా ఎంపికై కనీనం నాలుగు నెలలు కూడా కాకముందే ఆయన బలపడేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారనేది రేవంత్ రెడ్డి వర్గం వాదన, మరోవైపు రేవంత్ రెడ్డి సీనియర్‌లను కొంతమంది టార్గెట్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు.. గతంలో కూడా ఇలాంటీ ఆరోపణలపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో గతంలో వీహెచ్ మధ్యవర్తిత్వం వహించి సమస్యను సద్దుమణిగేలా చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇలా ఇద్దరి సమస్యతోపాటు పార్టీలో ఇతర నేతలు సైతం తమ సమస్యలపై గళం విప్పేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. ఒకరిపై ఒకరు కోవర్టులంటూ.. ఆరోపణలు చేయడం వెనక చాలా పరిణామాలే జరుగుతున్నాయి.. దీంతో సీనియర్ నేతలు సైతం ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి..

    Telangana News : సైకిల్‌పై తిరిగిన ఆమె నేడు అధికారిక లాంఛనాలతో కలెక్టరేట్‌లోకి.


    సో మొత్తం మీద కొంతమంది నేతల తీరుపై పొలిటికల్‌ నేటి సమావేశం చాలా వాడివేడిగా కొనసాగనుందనే ఉహగానాలు వెలువడుతున్నాయి. దీంతో ఎవరు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే..
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Revanth reddy, Telangana, TS Congress

    తదుపరి వార్తలు