Telangana Congress: నోరు జారితే ఇలా జరుగుతుందా ?.. తెగ బాధపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత..

ప్రతీకాత్మక చిత్రం

Komatireddy Venkatreddy: అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో నేతలు తరచూ నోరు జారుతుంటారు. సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేసి.. ఆ తరువాత లైట్ తీసుకుంటారు.

  • Share this:
    రాజకీయాల్లో నేతలు నోరు జారడం సహజం. అందులోనూ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో నేతలు తరచూ నోరు జారుతుంటారు. సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేసి.. ఆ తరువాత లైట్ తీసుకుంటారు. తాము సొంత పార్టీ నేతలపై కామెంట్స్ చేసినా.. ఏమీ కాదనే ధీమా కాంగ్రెస్ నేతల్లో కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఒక్కోసారి నేతలు చేసే కొన్ని కామెంట్స్.. వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    టీపీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రెడ్డిని(Revanth Reddy) ఎంపిక చేస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించిన వెంటనే.. కాంగ్రెస్‌లోనే ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్(Manickam Tagore).. ఈ పదవిని డబ్బు తీసుకుని అమ్ముకున్నారని ఆరోపించారు. ఆ తరువాత ఏదో ఆవేశంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను మాత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సీరియస్‌గా తీసుకున్నారు.

    MP Komatireddy Venkatreddy , ysr vardhanthi, ys vijayamma, Telangana politics, తెలంగాణ రాజకీయాలు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ వర్థంతి,
    కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(ఫైల్ ఫొటో)


    పార్టీపరంగా ఆయనపై చర్యలు తీసుకోకపోయినప్పటికీ.. ఆయనతో మాణిక్యం ఠాగూర్ మాట్లాడటం లేదని తెలుస్తోంది. ఠాగూర్‌తో మాట్లాడేందుకు, ఆయన అపాయింట్‌మెంట్ తీసుకునేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు రంగంలోక దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చితేనే పరిస్థితి చక్కబడుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    మరోవైపు భవిష్యత్తులో మరోసారి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పేందుకే మాణిక్యం ఠాగూర్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న సమావేశాలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకాకపోవడానికి ఇది కూడా ఓ కారణమనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి ఎక్కువగా విమర్శలు చేయకపోవడానికి మాణిక్యం ఠాగూర్ ఎపిసోడ్ కూడా ఓ కారణమనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి చాలామంది నేతల మీద నోరు జారిన విధంగానే మాణిక్యం ఠాగూర్ మీద కూడా విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు అందుకు ఇబ్బందిపడుతున్నట్టు తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: